చంద్రబాబు డ్రామాలు ఇకపై సాగవు

వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు

కావాలని గందరగోళం సృష్టించడం చంద్రబాబుకు అలవాటు

పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ మ‌ద్ద‌తుదారులు చిత్తుచిత్తుగా ఓడిపోయారు

ఓటమిని జీర్ణించుకోలేక  రాజకీయ డ్రామాలు

ఎన్నికల కోడ్‌ అమల్లో ఉందని ప్ర‌తిప‌క్ష నేత‌కు తెలీదా?

 మున్సిపల్‌ ఎన్నికల్లో టీడీపీకి అభ్యర్థులు కరువు

నిరసనకు అనుమతి లేదని నిన్ననే పోలీసులు నోటీసులు ఇచ్చారు

వైయస్‌ జగన్‌ను విశాఖ ఎయిర్‌పోర్టులో ఆపినప్పుడు ప్రజాస్వామ్యం ఏమైంది

తాడేపల్లి: టీడీపీ అధినేత చంద్రబాబు డ్రామాలు ఇకపై సాగవని వైయస్‌ఆర్‌ కాంగ్రెరస్‌ పార్టీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు హెచ్చరించారు.  ప్రజల్లో భ్రమలు కలిగించేందుకు చంద్రబాబు ఇవాళ ఎయిర్‌పోర్టులో డ్రామాలాడారని, ఎన్నికల కమిషనర్‌ వద్ద ఆయన తాబేదారు మరొకరు రచ్చరచ్చ చేశారని తప్పుపట్టారు. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నందునే చంద్రబాబు ఎయిర్‌పోర్టులో ఆపారని తెలిపారు. పంచాయతీ ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేక చంద్రబాబు డ్రామాలకు తెర లేపారని మండిపడ్డారు. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉందని చంద్రబాబుకు తెలీదా అని అంబటి రాంబాబు నిలదీశారు. సోమవారం తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు.

టీడీపీ క్యాడర్‌ను మోసం చేసి నమ్మించే ప్రయత్నం

ఎన్నికల్లో ఓటమిని గ్రహించిన చంద్రబాబు ఏదో ఒక గందరగోళం సృష్టించాలని కుట్ర చేస్తున్నారు. ఇది చంద్రబాబు నైజం. మొన్న జరిగిన పార్లమెంట్, శాసన సభ ఎన్నికల్లో తన ఓటమి తప్పదని తెలిసీ కూడా చాలా డ్రామాలాడారు. ఎలక్ట్రానిక్స్‌ ఓటింగ్‌లో గందరగోళం జరిగిందని నమ్మించే ప్రయత్నం చేశారు. క్యాడర్‌ను మోసం చేసి నమ్మించాలనే ప్రయత్నం ప్రతిసారి చంద్రబాబు చేస్తునే ఉంటారు. పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ మద్దతుదారులు చిత్తు చిత్తుగా ఓడిపోయారు. పట్టుమని పది సీట్లు కూడా  ఆ పార్టీ మద్దతుదారులకు రాలేదు. దౌర్జన్యాలు, బెదిరింపుల వల్లే ఓడిపోయానని, తనకు పెద్ద ప్రజాదరణ ఉందని క్యాడర్‌ను నమ్మించే ప్రయత్నం చంద్రబాబు చేస్తున్నారు.

ఎన్నికల కోడ్‌ అమల్లో ఉందని బాబుకు తెలీదా?
చిత్తూరు జిల్లాలో పంచాయతీ ఎన్నికల్లో అక్రమాలు, అన్యాయం, మెసాలు జరిగాయని ఇవాళ తిరుపతి నగరంలోని గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేసేందుకు చంద్రబాబు బయలుదేరారు. బాధ్యత కలిగిన ప్రజా నాయకుడిగా ఉన్న నేతకు ఎన్నికల కోడ్‌ విషయం తెలియదా? కోవిడ్‌ నిబంధనలు అమలులో ఉన్నాయి. ఇలాంటి పరిస్థితిలో గాంధీ విగ్రహం వద్ద కూర్చుంటా అంటే చట్టాలు అంగీకరిస్తాయా? «ఇది ధర్మమేనా?  తనను నిలువరించడానికి వీల్లేదంటూ బెదరించడం ఎంత వరకు సమంజసం. మీ పార్టీకి ఎంత ప్రజాదరణ ఉంది. మీ పార్టీ పరిస్థితి ఏంటో మీకు తెలియదా? మీ పార్టీ కార్యకర్తల్లోనే మీపై విశ్వాసం లేదు. మీ వారసుడు అని ప్రకటించుకున్న నారా లోకేష్‌ను మంగళగిరిలో గెలిపించుకోలేకపోయారు. ఇవాళ లోకల్‌బాడీ ఎన్నికల్లో గెలిచే పరిస్థితి లేదని మీకు కూడా తెలుసు. టీడీపీలో ఏ ఒక్కరికి మీపై ఆత్మ విశ్వాసం లేదు. పైగా మాకు అభ్యర్థులు దొరక్క మీ అభ్యర్థులను తెచ్చుకుంటున్నామని ఆరోపిస్తున్నారు. ఓటమికి చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేష్‌ కారణం. ఓటమిని జీర్ణించుకోలేక చంద్రబాబు రాజకీయ డ్రామాలాడుతున్నారు. ప్రజలపై, సీఎం వైయస్‌ జగన్‌పై నెపం మోపుతున్నారు.

పోలీసులపై గర్జన ఏంటి?
మీ చిత్తూరు జిల్లా కుప్పంలో మీ పార్టీకి పంచాయతీ ఎన్నికల్లో 14 సీట్లు వచ్చాయి. టీడీపీ కాదు ..ప్రజాస్వామ్యం ఓడిందని చెప్పావే. వీధివీధి తిరిగి తప్పు అయిపోయింది..క్షమించండి..మూడు నెలలకు ఒకసారి వస్తామని, మీ కుమారుడిని పంపిస్తామని ఓటమిని అంగీకరించారు. ఇక్కడొచ్చి మరోమాట మాట్లాడుతున్నారు.
ఇవాళ రేణిగుంట ఎయిర్‌ పోర్టులోకి వెళ్తే..పోలీసులు ఏమన్నారు..ఎన్నికల కోడ్‌ అమలులో ఉంది. కోవిడ్‌ నిబంధనలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితిలో నిరసన కార్యక్రమాలకు అనుమతి లేదు అని చెప్పారు. పర్మిషన్‌ తీసుకుని రండి అని పోలీసులు చెబితే..వారిపైనే చంద్రబాబు గర్జించారు. ప్రజాస్వామ్యంలో మేం లేమా?  ఖూనీ అయిపోయిందా? మాకు హక్కు లేదా? 14 ఏళ్లు సీఎంగా ఉన్నాను. ప్రతిపక్ష నేతను అని గొప్పగా చెప్పుకున్నావే. ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్న సమయంలో ఎందుకు అనుమతి తీసుకోలేదు. ఓ పోలీసు అధికారి మోకాళ్లపై కూర్చొని దండం పెడితే కూడా చంద్రబాబు అంగీకరించలేదు. చంద్రబాబు అన్నం తినలేదని, మంచినీళ్లు ముట్టుకోలేదని ఎల్లోమీడియా ఊదరగొట్టింది. నిన్న రాత్రి నోటిసు ఇస్తే..కోర్టుకు ఎందుకు వెళ్లలేదు. చట్టాన్ని చంద్రబాబు అతిక్రమిస్తునారు.

మోసగాడిని చూసి ఎందుకు భయపడతాం...
14 ఏళ్లు సీఎంగా పని చేసినా, ప్రతిపక్షనేత అయినా, కేంద్రంలో చక్రం తిప్పినా సరే చట్టాన్ని అతిక్రమిస్తే..కానిస్టేబుల్‌ అయినా అరెస్టు చేస్తారు. ఓడిపోయిన వ్యక్తిపై మాకు కక్ష ఏంటి? ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు దొరకని పార్టీని చూసి మేం ఎందుకు భయపడుతాం. ఇవాళ ప్రజలు మా పాలనకు బ్రహ్మరథం పడుతున్నారు. మోసగాడిని చూసి ఎందుకు భయపడాలి. కుప్పంలోనే నీకు సత్తా లేదు. ఇవాళ ఏదో గందరగోళం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు తాబేదార్ల కామెంట్లు ఆశ్చర్యకరంగా ఉన్నాయి.

ఆ రోజు ప్రజాస్వామ్యం లేదా?
ఆ రోజు కోవిడ్‌ లేదు. ఎన్నికల నిబంధనలు లేవు. 2017లో విశాఖలో కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొనేందుకు ప్రతిపక్ష నేత హోదాలో వైయస్‌ జగన్‌ వెళ్లారు. ఆయన వెంట మేం కూడా వెళ్లాం. ఎయిర్‌పోర్టులో రన్‌వే మీదనే మమ్మల్ని అడ్డుకున్నారు.  ఆ రోజు ప్రజాస్వామ్యం లేదా? ఆ రోజు చీకటి రాజ్యం ఏమైంది. రూల్‌ ఆఫ్‌ లా ఏమైంది. ఆ రోజు వైయస్‌ జగన్‌ను రన్‌వేపై కూర్చొబెట్టారు. ఆ రోజు ప్రజాస్వామ్యం మంటగలపలేదా? ఆ రోజు మీరు చేశారని..ఈ రోజు మేం చేయడం లేదు. నిబంధనల మేరకే మేం వ్యవహరిస్తున్నాం. ఇలాంటి డ్రామాలకు రోజులు చెల్లాయని చంద్రబాబు గుర్తు పెట్టుకోవాలి. ఇవాళ హైకోర్టులో కొన్ని పిటిషన్లు ఉన్నాయి. వాటిని ప్రభావితం చేయాలని చంద్రబాబు ఆలోచన చేస్తున్నారా?. అలాంటి ప్రభావాలు కోర్టులపై ఉండవని చంద్రబాబు గుర్తు పెట్టుకోవాలి.

మీరు ఓడిపోతే ఎన్నికల కమిషన్‌ పనిచేయడం లేదంటారా?
చంద్రబాబు చిత్తూరులో రచ్చ చేస్తే..ఆయన తాబేదారు మరొకరు ఎలక్షన్‌ కమిషనర్‌ వద్ద రచ్చ రచ్చ చేశారు. ఇవాళ ఎలక్షన్‌ కమిషనర్‌ నచ్చలేదంట. అప్పుడేమో నిమ్మగడ్డ రమేష్‌ దైవాంశ సంభూతుడని కొనియాడారే? . మీరు ఓడిపోతే ఎలక్షన్‌ కమిషన్‌ పనిచేయడం లేదా? ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందా?. ఈ రెండు వీరంగాలు చూసి ప్రజలు అబ్బబ్బా అని భ్రమపడుతారని అనుకుంటున్నారా?. చిత్తూరు ఎయిర్‌పోర్టులో చంద్రబాబు వీరంగం, ఎన్నికల కమిషనర్‌ వద్ద నీవు పంపించిన మరో పెద్దాయన వీరంగం సృష్టించారు.  మీ పార్టీ తరఫున నిలబడటానికి కూడా అభ్యర్థులు దొరకని పరిస్థితిని కప్పిపుచ్చుకునేందుకు ఇవాళ డ్రామాలాడుతున్నారు. ఇది సరైన విధానం కాదు. మీరు గొప్పవారు కావొచ్చు ఒకప్పుడు, మీరు ముఖ్యమంత్రి కావొచ్చు ఒకప్పుడు, మీరు ప్రజాధరణ లేని ఒక పార్టీకి అధ్యక్షుడు..పిచ్చి చేష్టలు చేస్తే ప్రజలు సహించరు. చట్టప్రకారం ఎన్నికల్లో పోటీ చేయండి..అక్కడ చూసుకుందాం. తప్పుడు ప్రచారాలు చేసి ప్రజలను మభ్యపెట్టాలని చూస్తే ప్రజాస్వామ్యంలో కుదరదని గుర్తు పెట్టుకోవాలి.

సీఎం రావాల్సిన అవసరం లేదు
ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఇల్లు కదిలి బయటకు రావడం లేదని ఆరోపిస్తున్నారు. లోకల్‌ బాడీ ఎన్నికలకు ముఖ్యమంత్రి రావాల్సిన అవసరం లేదు. నీవంటే పిచ్చిపట్టి తిరుగుతున్నావు. వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి పంచాయతీ ఎన్నికలకు రావాల్సిన అవసరం ఏముంది? ఎమ్మెల్యేగా నేనే పంచాయతీ ఎన్నికలకు ఏ గ్రామానికి వెళ్లలేదు. వైయస్‌ జగన్‌ పిరికివాడు అన్న మాట మాట్లాడుతున్నారంటే..ఆయన ఏ స్థాయికి దిగజారిపోయారో అర్థం చేసుకోవాలి. చంద్రబాబు, ఆయన కుమారుడే పిరికివాళ్లు. డ్రామాలకు రోజులు చెల్లాయి. ప్రజాస్వామ్యంలో చక్కగా పరిపాలన చేసే రోజులు వచ్చాయి. పిచ్చిపిచ్చి వేశాలు వేయడం సరైంది కాదని గుర్తు పెట్టుకోవాలి.మీరు అరెస్టులు చేస్తే..మీరు గృహ నిర్భందాలు చేస్తే, ఎయిర్‌పోర్టు రన్‌వేపై ఆపేస్తే అది ప్రజాస్వామ్యం. చట్టానికి వ్యతిరేకంగా, అనుమతిలేకున్నా. కోవిడ్, ఎన్నికల నిబంధనలు ఉన్నా కూడా మీరు నిరసన తెలిపేందుకు వెళ్తే ప్రభుత్వం అడ్డుకోవడం అప్రజాస్వామ్యమా? ..ప్రజలు నవ్వుకుంటున్నారు. నీకొధర్మం. మాకొక ధర్మమా? . చంద్రబాబు ఇప్పటికైనా  అభాసుపాలు కాకుండా చట్టప్రకారం వ్యవహరిస్తే మంచిదని ఎమ్మెల్యే అంబటి రాంబాబు సూచించారు.

Back to Top