అనంతపురం: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్ర అభివృద్ధి కన్నా అక్రమ కేసులపైనే ఎక్కువ దృష్టి పెట్టారని వైయస్ఆర్‌సీపీ సోషల్ మీడియా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ బాబా సలామ్ విమర్శించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైయస్ఆర్‌సీపీ సోషల్ మీడియా, వైయస్ఆర్‌సీపీ మేధావుల విభాగం సంయుక్తంగా అనంతపురం నగరంలోని నడిమి వంక నుంచి కళ్యాణదుర్గం రోడ్ వరకు సంతకాల సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా వైయస్ఆర్‌సీపీ సోషల్ మీడియా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ బాబా సలామ్ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా కాకుండా కేవలం రాజకీయ స్వార్థం తోనే ప్రతిపక్ష పార్టీ నేతలను అక్రమంగా అరెస్టు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలు కూటమి ప్రభుత్వం చేపడుతున్న ప్రతి చర్యలను గమనిస్తున్నారని, రాబోయే రోజుల్లో గట్టిగానే బుద్ధి చెప్తారని హెచ్చరించారు. వైయస్ఆర్‌సీపీ మేధావుల విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి శంకరయ్య మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం లో ప్రభుత్వ రంగ సంస్థలనే కాకుండా విద్య రంగానికి చెందిన సంస్థలను సైతం ప్రవేటికరణ చేయడం దారుణమన్నారు. విద్యాభివృద్ధి కోసం పాటుపడాల్సిన ప్రభుత్వం ఇలా ప్రవేటికరణ చేయడం దుర్మార్గమన్నారు. రాష్ట్ర చరిత్ర లో విద్యాభివృద్ధి సువర్ణ యుగం అంటే అది కేవలం 2019 నుంచి 2024 వరుకు ముఖ్యమంత్రి గా పరిపాలించిన వైయస్ఆర్‌సీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలోని వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం మాత్రమే అని తెలిపారు. కార్యక్రమంలో వైయస్ఆర్‌సీపీ మేధావుల విభాగం రాష్ట్ర కార్యదర్శి కట్టుబడి తానిషా , నాయకులు రిటర్డ్ కామర్స్ లెక్చరర్ మహాదేవ రెడ్డి, దాసి రెడ్డి పాల్గొన్నారు.