తాడేపల్లి: పరిపాలన గ్రామస్థాయికి తీసుకెళ్లిన సాహసికుడు ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమేనని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. ఇన్నాళ్లుగా అధికారంలోకి వచ్చిన ఏ పార్టీ, ఏ ముఖ్యమంత్రి కూడా గాంధీజీ ఆశయాల గురించి ఆలోచన చేయలేదని, గ్రామస్థాయికి పరిపాలన తీసుకెళ్లలేదన్నారు. పరిపాలన గ్రామస్థాయికి తీసుకెళ్లిన సాహసికుడు వైయస్ జగన్ మాత్రమేనని మనం గర్వంగా చెప్పుకోవచ్చు అన్నారు. అంతేకాదు.. వైయస్ జగన్ పాలన నూతన చరిత్రను లిఖిస్తుందన్నారు. వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మహాత్మా గాంధీ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పాల్గొని గాంధీ చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మహాత్మా గాంధీ ఆనాడు ప్రవచించిన నినాదాన్ని సీఎం వైయస్ జగన్ ఆచరించి అమలు చేశారన్నారు. గ్రామస్థాయికి పాలనే కాదు.. గడప ముందుకు సంక్షేమాన్ని తీసుకెళ్తున్నారని చెప్పారు. రైతాంగానికి సంక్షేమం గట్టుస్థాయికి తీసుకెళ్లారని, పంట పండించండి గట్టు దగ్గరకు యంత్రాంగాన్ని పంపించి కొనుగోలు చేయిస్తానని రైతుల్లో భరోసా నింపారన్నారు. పంటకు పెట్టుబడిసాయంతో పాటు గ్రామస్థాయిలోనే ఎరువులు, పురుగుమందులు, విత్తనాలు సరఫరా చేస్తానని రైతు భరోసా కేంద్రాలు తెచ్చారన్నారు. గతంలో ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడూ, ఎక్కడా జరగలేదన్నారు. రూ. 1కే పంట ఇన్సూరెన్స్ కల్పిస్తున్నారని, గాంధీజీ ఆలోచన విధానాన్ని అనుసరించి విజయవంతంగా సీఎం వైయస్ జగన్ అమలు చేస్తున్నారన్నారు.