బీసీల అభివృద్ధికి వైయ‌స్ జ‌గ‌న్ క‌ట్టుబ‌డి ఉన్నారు

వైయస్‌ జగన్‌ నాయకత్వంలోనే బీసీల సంక్షేమం..

బీసీ డిక్లరేషన్‌ చిరస్థాయిగా నిలిచిపోతుంది..

బీసీల మేలు కోసం వైయస్‌ఆర్‌సీపీ సుస్థిర విధానాలు..

బీసీలకు ఎన్టీఆర్,చంద్రబాబులు చేసేందేమీలేదు

వైయస్‌ఆర్‌సీపీ నేతలు బొత్స,పెద్దిరెడ్డి

ఏలూరు:రేపు ఏలూరులో జరిగే బీసీ గర్జనలో వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి బీసీ డిక్లరేషన్‌ ప్రకటించబోతున్నారని వైయస్‌ఆర్‌సీపీ నేత బొత్స సత్యనారాయణ అన్నారు.బీసీలకు మేలు చేసే విధంగా ఒక ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిపారు.రేపు జరిగే సభ బీసీలకు ఒక సువర్ణ అధ్యాయంగా పేర్కొన్నారు.బీసీలపై పార్టీ విధానాలు,ప్రణాళికలు ప్రకటించనున్నారని తెలిపారు.బీసీలపై పట్ల వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి ఉన్న అంకితభావం,ప్రేమ చిరస్థాయిగా నిలిచేపోయే విధంగా సుస్థిరమైన విధానాలు ప్రవేశపెట్టనున్నారని తెలిపారు.బీసీలంతా సభను విజయవంతం చేయాలని కోరారు.

బీసీలకు ఎన్టీఆర్,చంద్రబాబులు చేసేందేమీలేదు: పెద్దిరెడ్డి

దాదాపు 1983 నుంచి బీసీలను ఉద్దరిస్తామని..వారి ఓట్లను ఉపయోగించుకుని టీడీపీ చాలా సంవత్సరాలు అధికారంలో కొనసాగిందే తప్ప వారి స్థితిగతులను పట్టించుకోలేదని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. నేడు వాస్తవ పరిస్థితులు గమనిస్తే ఏం జరుగుతుందో అందరికి తెలుసునన్నారు. కేవలం బీసీలను ఓటు బ్యాంకుగా మాత్రమే ఉపయోగించుకుని అన్యాయం చేశారన్నారు.వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి బీసీలకు జరుగుతున్న అన్యాయంపై దృష్టి సారించారన్నారు. వారి అభ్యున్నతికి బీసీ అధ్యయన కమిటీ వేసి  క్షేత్రస్థాయిలో వారి సమస్యలను,కష్టనష్టాలను తెలుసుకున్నారన్నారు. జంగా కృష్ణమూర్తి ఆధ్వర్యంలో బీసీ అధ్యయన కమిటీ రాష్ట్రమంతట పర్యటించారని తెలిపారు.ఇలాంటి ప్రయత్నం తెలుగుదేశం పార్టీలో ఎన్నడూ జరగలేదన్నారు.ఊకదంపుడుగా బీసీలకు అదిచేస్తాం..ఇది చేస్తాం.. అని ప్రగల్భాలు పలకడం తప్ప వారికి చేసేందేమీ లేదన్నారు.అధ్యయన కమిటీ ఇచ్చిన రిపోర్ట్‌ను వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి క్షుణ్ణంగా పరిశీలించి బీసీలందరికి న్యాయం చేసి ఆదుకోవాలనే సంకల్పంతో రేపు జరగబోయే బీసీ గర్జనలో బీసీ డిక్లరేషన్‌ ఇవ్వబోతున్నారని తెలిపారు.

తాజా ఫోటోలు

Back to Top