వైయ‌స్ఆర్‌సీపీ నేతల ఇళ్లపై దాడులు హేయం

వైయ‌స్ఆర్‌సీపీ మాజీ ఎమ్మెల్యే సామినేని ఉద‌య‌భాను
 

కృష్ణా జిల్లా : ఎన్నికల ఫలితాల తర్వాత  వైయ‌స్ఆర్‌సీపీ మాజీ ఎమ్మెల్యేలు కొడాలి నాని ,పేర్ని నాని, వల్లభనేని వంశీ ఇళ్లపై దాడులు చేయటం హేయమైన చర్య అని కృష్ణా జిల్లా జగ్గయ్య పేట వైయ‌స్ఆర్‌సీపీ మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను మండిపడ్డారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా వైయ‌స్ఆర్‌సీపీ సానుభూతిపరులపై జరుగుతున్న దాడుల్ని ఆయన ఖండించారు. కృష్ణా జిల్లా జగ్గయ్య పేటలో వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై జరుగుతున్న దాడులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

వరుస దాడులపై పోలీసులు తాత్కాలిక కేసులు నమోదు చేసి చేతులు దులుపుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో ప్రజా తీర్పును మేం గౌరవిస్తాం. జగ్గయ్యపేటలో గెలిచిన ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్‌కు అభినందనలు. ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా ఉండేందుకు నాయకులు ప్రయత్నించాలని వైయ‌స్ఆర్‌సీపీ మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను విజ్ఞప్తి చేశారు.  

Back to Top