విశాఖ: ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల మేనిఫెస్టో, పాదయాత్రలో డ్వాక్రా మహిళలకు ఇచ్చిన హామీని నెరవేర్చారని, డ్వాక్రా రుణాలు తీర్చారని వైయస్ఆర్‌సీపీ రీజనల్ కో-ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు పేర్కోన్నారు. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా వైయస్ఆర్ ఆసరా సంబరాలు ఘనంగా నిర్వహించారు. గాజువాకాలో నిర్వహించిన కార్యక్రమంలో రీజనల్ కో-ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, కోఆర్డినేటర్ ఉరికూటి పూర్ణచంద్రరావు , నగర మేయర్ గొలగాని హరి కుమారి, మాజీ ఎమ్మెల్యేలు తిప్పల గురుమూర్తి రెడ్డి, చింతలపూడి వెంకట్రామయ్య తదితరులు పాల్గొని సీఎం వైయస్ జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. విజయనగరంలో.. రాజాం రూరల్ మండలం అంతకాపల్లి మోగిలివలస, రాజాం టౌన్, రాజాం రూరల్ మండలాల్లో నిర్వహించిన వైయస్ఆర్ ఆసరా నాలుగవ విడత కార్యక్రమంలో ముఖ్య అతిథిలుగా జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను), విజయనగరం జిల్లా పార్లమెంట్ సభ్యులు బెల్లాన చంద్రశేఖర్ (పెదబాబు), ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, రాజాం అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్ధి, ఇంఛార్జి గౌ. డాక్టర్ తలే రాజేష్, తదితరులు పాల్గొని డ్వాక్రాం సంఘాలకు చెక్కులు అందజేశారు. ఈ సంద్భంగా చిన్న శ్రీను మాట్లాడుతూ.. ఇచ్చిన మాట నెరవేర్చాం అని, నాలుగు విడతల్లో ఆసరా పథకం కింద డ్వాక్రా రుణాలు తీర్చాం అని,. తద్వారా స్త్రీలకు ఆర్థిక స్వావలంబన కల్పించామని అన్నారు. విపక్ష నేతల మాటలను మీరు నమ్ముకుంటే మీకు బోడిగుండే మిగులుతుందని, ఇచ్చిన మాట నిలబెట్టుకునే ప్రభుత్వాన్ని మరోసారి ఎన్నుకుని పాలించేందుకు మరోసారి అవకాశం ఇవ్వాలని కోరారు. రాజాం అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్ధి, ఇంఛార్జి డాక్టర్ తలే రాజేష్ మాట్లాడుతూ.. మీరు ఓటు వేస్తారో లేదో చూడలేదు, మీరు ఇంటి మీద జెండా కడతారా అని చూడలేదు, కులం చూడలేదు, కేవలం అర్హత ఉంటే చాలు పథకాలు వర్తింపజేశాం. ఇదీ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఘనతని, అంతేకాదు ఏ పథకం కోసం కూడా ఎవ్వరూ లంచం ఇచ్చింది లేదు,ఎవ్వరూ తీసుకున్నది లేదు, పథకాల అమలులో మేము ఎవ్వరూ ఏ పార్టీ అని చూడలేదు, మోసం చేసే వాళ్ళు ఎవ్వరో? ప్రజల స్థితి గతులు పెంచేందుకు ఎవరు కృషి చేశారో? గమనించాలి సీఎం జగన్ పేదలకు పంచి పెడుతున్నారు అంటున్నారు కానీ, దోచేస్తునారు అని ఎవ్వరూ చెప్పడం లేదు కదా.. ఇది ప్రజల గుర్తుంచుకోవాలని డాక్టర్ రాజేష్ పేర్కొన్నారు. ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ (పెదబాబు) మాట్లాడుతూ..ఎన్నికల ముందు చెప్పినవి చెప్పినట్టుగా చేసిన పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నాలుగు విడతల్లో మహిళా సంఘాలకు తీరుస్తాం అని చెప్పాం నాలుగో విడత ఇప్పుడు తీర్చేశాం. బ్యాంకులకు బకాయిలు లేవు ఈరోజు అధికారం కోసం అబద్ధాలు చెప్పి తీరా ఆ అధికారం పొందాక చెప్పినవి పక్కన పెట్టి,మొక్కు బడిగా ఎన్నికల ముందు పసుపు కుంకుమ అంటూ ఇస్తే, మహిళలు అది గ్రహించి చంద్రబాబుకి దెబ్బ కొట్టారు. మాట మీద నిలబడే వ్యక్తి సీఎం వై.ఎస్.జగన్, మాట నిలబెట్టుకోలేని వ్యక్తి చంద్రబాబు అని అందరికీ తెలిసి వచ్చింది. 2019లో ఓటు వేసి ఎన్నుకున్న ఈ ప్రభుత్వం గడువు పూర్తి కావస్తోంది. గత ప్రభుత్వం పాలన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పాలన చూసాక ప్రజలకే అర్థం అవుతోంది ఎవరికి తాళం ఇవ్వాలి అని.. చంద్రబాబు 2014లో తాళం ఇస్తే పెట్టెలో డబ్బులు తీశారు కానీ, ప్రజల కోసం కాదు. ప్రజాస్వామ్యంలో ప్రజల నిర్ణయం మీదనే ప్రభుత్వాలు ఏర్పడతాయన్నారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ మాట్లాడుతూ.. నాటి ప్రభుత్వాన మోసం చేసిన చంద్రబాబు ఒక పక్క,ఊళ్ళలో ప్రజల ధనం దోచుకునేందుకు బ్రోకర్స్ మరో పక్క ఉండేవారు. కానీ ఇవాళ మాట నిలబెట్టి,కుటుంబాల్లో ఉండే ప్రతి ఒక్కరికీ ఏదో ఒక రూపేణా ప్రభుత్వం సాయంగా ఉంది, ఆకలి తీర్చి,కన్నీరు తుడిచి గౌరవం పెంచిన పని చేసే సీఎం జగన్ ఈ ఇద్దరిలో ఎవరికి మద్దతు తెలుపుతారు..ఇన్ని మోసాలు చేసిన చంద్రబాబు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మళ్ళీ మోసం చేసేందుకు దొంగ మానిఫెస్టో వస్తారు. ఇందులో భాగంగా ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తాం అని చెపుతున్నారు.. అవి నమ్మితే మీకు బోడిగుండు మిగులుతుందని అన్నారు. ఆచంట నియోజకవర్గంలో.. ఆచంట నియోజకవర్గం తూర్పు పాలెం వైయస్ఆర్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రివర్యులు పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షులు ఆచంట నియోజవర్గ ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథ్ రాజు ఆధ్వర్యంలో నాలుగు మండలాల వేలాదిమంది డ్వాక్రా అక్క చెల్లెమ్మల మధ్య వైయస్ఆర్ ఆసరా సంబరాలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్‌పర్సన్ మేడపాటి షర్మిళ రెడ్డి , రాజమండ్రి పార్లమెంట్ సీనియర్ నాయకులు గుద్దే రఘు నరేష్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.