420 బ్యాచ్‌ అంతా కలిసొచ్చినా వైయస్‌ జగన్‌ను ఎదుర్కోలేరు

గన్నవరంలో టీడీపీకి తాడూ, బొంగరం లేదు

వైయస్‌ఆర్‌ సీపీ రీజనల్‌ కోఆర్డినేటర్, ఎమ్మెల్యే కొడాలి నాని

కృష్ణా: 420 బ్యాచ్‌ అంతా కలిసొచ్చినా ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ను ఎదుర్కోలేరని వైయస్‌ఆర్‌ సీపీ రీజనల్‌ కోఆర్డినేటర్, ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. గన్నవరం నియోజకవర్గ వైయస్‌ఆర్‌ సీపీ ప్లీనరీ సమావేశానికి మంత్రి జోగి రమేష్, కొడాలి నాని, పేర్ని నాని హాజరయ్యారు. ఈ సందర్భంగా కొడాలి నాని మాట్లాడుతూ.. గన్నవరంలో టీడీపీకి తాడూ, బొంగరం లేదని ఎద్దేవా చేశారు. పేద పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని సీఎం వైయస్‌ జగన్‌ ఇంగ్లిష్‌ మీడియం ప్రవేశపెడితే.. చంద్రబాబు బ్యాచ్‌ నానా రాద్ధాంతం చేసిందని మండిపడ్డారు. చంద్రబాబు, లోకేష్, పవన్‌ కల్యాణ్‌ పిల్లలు ఎక్కడ చదివారని ప్రశ్నించారు. ఎన్టీఆర్‌ కుటుంబం, అభిమానుల సానుభూతి కోసమే చంద్రబాబు ఏడుపు మొదలుపెట్టాడని, అవసరమైతే కాళ్లు పట్టుకుంటాడని, అవసరం తీరాక వెన్నుపోటు పొడుస్తాడని కొడాలి నాని అన్నారు. 
 

Back to Top