మినీ మహానాడులేంటీ..? పెద్దదినం అయ్యాక.. చిన్నదినం చేస్తారా..?

చంద్రబాబు కొడుక్కు కరెక్ట్‌ సూటయ్యే పేరు సిద్దప్ప

బాబును గద్దెనెక్కించాలని రామోజీ, రాధాకృష్ణ, బీఆర్‌నాయుళ్ల ఆరాటం

రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి ఎల్లో మీడియాకు కనిపించడం లేదా..?

మచిలీపట్నం వైయస్‌ఆర్‌ సీపీ ప్లీనరీలో రీజనల్‌ కోఆర్డినేటర్, ఎమ్మెల్యే కొడాలి నాని

మచిలీపట్నం: మహానాడు అనేది ఎన్టీఆర్‌ పుట్టిన రోజునాడు చేసేగొప్ప కార్యక్రమం.. అలాంటి కార్యక్రమాన్ని చంద్రబాబు అపహాస్యం చేస్తున్నాడు. ఒంగోలు మహానాడు అయిపోయిన తరువాత.. మినీ మహానాడు అంటూ రాష్ట్రమంతా తిరుగుతున్నాడు.  ఎవరైనా పెద్దదినం చేశాక.. చిన్న దినం చేస్తారా..? అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రీజనల్‌ కోఆర్డినేటర్,ఎమ్మెల్యే కొడాలి నాని ఎద్దేవా చేశారు. మచిలీపట్నం నియోజకవర్గ వైయస్‌ఆర్‌ సీపీ ప్లీనరీలో కొడాలి నాని పాల్గొని మాట్లాడారు. 

‘పేద పిల్లలను ఉన్నత చదువులు చదివించాలి. బ్రహ్మాండంగా తీర్చిదిద్దాలని, ఇంగ్లిష్‌ మీడియం, సీబీఎస్‌ఈ, బైజూస్‌ వంటి విప్లవాత్మక కార్యక్రమాలకు సీఎం వైయస్‌ జగన్‌ శ్రీకారం చుట్టారు. ఎనిమిదో తరగతి పిల్లలకు ట్యాబ్‌లు ఇచ్చే గొప్ప నిర్ణయం తీసుకున్నారు. కార్పొరేట్‌ పాఠశాలలకు దీటుగా విద్యను అభ్యసించాలి. పేద పిల్లలు గ్రామాల్లో ఉండిపోకుండా ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్లి ఉద్యోగం, వ్యాపారం చేసుకునేలా తీర్చిదిద్దుతున్నారు.

చంద్రబాబును ముఖ్యమంత్రిగా కొనసాగించేందుకే పార్టీ పెట్టిన పవన్‌ కల్యాణ్, చంద్రబాబే ముఖ్యమంత్రిగా ఉంటే రాష్ట్రాన్ని దోచుకుతినొచ్చు, దొంగళ్లా పంచుకోవచ్చు అని ఈనాడు రామోజీరావు, ఏబీఎన్‌ రాధాకృష్ణ, టీవీ5 బీఆర్‌నాయుడు డిబేట్లు పెడతారు.. పేపర్లలో తప్పుడు కథనాలు రాస్తున్నారు. సీఎం వైయస్‌ జగన్‌ సంక్షేమ పథకాలతో సంపదను పేదలకు పంచుతున్నాడని మాట్లాడుతున్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేదని మాట్లాడుతున్నారు. రూ.8వేల  కోట్లతో 16 మెడికల్‌ కాలేజీలు నిర్మిస్తుండటం అభివృద్ధి కాదా.. 20వేల కోట్లతో నాడు–నేడు ద్వారా పాఠశాలలను ఆధునీకరిస్తే అభివృద్ధి కాదా..? రాష్ట్రంలోని ఆస్పత్రులను ఆధునీకరించి, అత్యాధునిక పరికరాలు సమకూర్చడం, నూతన బిల్డింగ్‌లు నిర్మించడం అభివృద్ధికాదా..? చదువుకున్న పిల్లలకు గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఉద్యోగం కల్పించడం, ఆర్బీకే, వైయస్‌ఆర్‌ హెల్త్‌ క్లినిక్‌ ఇవన్నీ అభివృద్ధి కాదా..?

ఎలాగైనా వైయస్‌ జగన్‌నుదించేయాలి. చంద్రబాబును కుర్చీలోకి ఎక్కించాలని వారి ఆరాటం. చంద్రబాబు కొడుకు కరెక్ట్‌ పేరు సిద్దప్ప, గెటప్, పర్సనాలిటీ, హావభావాలు, చిటికెలు, తప్పెట్లు అన్ని చూస్తే కరెక్ట్‌ పేరు సిద్దప్ప సూటవుతుంది. చంద్రబాబుకు వృద్ధాప్యం వచ్చింది. మైండ్‌ పనిచేయడం లేదు. నిన్న రాత్రి ఎన్టీఆర్‌ పుట్టిన ప్రాంతం నిమ్మకూరు వెళ్లి పడుకున్నాడు. గుడివాడలో ఈరోజు బహిరంగసభ, రేపు మచిలీపట్నం వచ్చి ఏడు నియోజకవర్గాలతో కార్యకర్తలతో మాట్లాడుతాడంట. చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా వైయస్‌ఆర్‌ సీపీ నేతల వెంట్రుక కూడా పీకలేరు`. 
 

Back to Top