మ‌ళ్లీ మ‌న‌దే అధికారం

 వైయ‌స్ఆర్‌సీపీ రీజిన‌ల్ కో-ఆర్డినేట‌ర్ బాలినేని శ్రీ‌నివాస‌రెడ్డి

తిరుప‌తి: అంద‌రం క‌లిసిక‌ట్టుగా ప‌ని చేస్తే మ‌ళ్లీ మ‌న‌దే అధికార‌మ‌ని వైయ‌స్ఆర్‌సీపీ రీజిన‌ల్ కో-ఆర్డినేట‌ర్ బాలినేని శ్రీ‌నివాస‌రెడ్డి  పేర్కొన్నారు. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ సత్యవేడు నియోజకవర్గ సమీక్షా సమావేశం శుక్ర‌వారం నిర్వ‌హించారు.  ఈ సమావేశానికి రీజినల్ కో ఆర్డినేటర్ బాలినేని శ్రీనివాస రెడ్డి, తిరుపతి జిల్లా పార్టీ అధ్యక్షుడు నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి, తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి, సత్యవేడు శాసనసభ్యులు ఆదిమూలం, సత్యవేడు నియోజకవర్గ పరిశీలకుడు దయసాగర్ రెడ్డి పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా బాలినేని శ్రీ‌నివాస‌రెడ్డి మాట్లాడుతూ..పాద‌యాత్ర‌లో ప్ర‌జ‌ల క‌ష్టాలు క‌ళ్లారా చూసిన వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి 2019 ఎన్నిక‌ల మేనిఫెస్టోలో పొందుప‌రిచిన అంశాల్లో ఇప్ప‌టికే 98 శాతం హామీలు అమ‌లు చేశార‌ని తెలిపారు. అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌కు మేలు చేసిన ఏకైక ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ ఒక్క‌రే అన్నారు.  వైయ‌స్ జ‌గ‌న్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాల‌తో ల‌బ్ధిపొందిన ప్ర‌తి ఒక్క‌రిని గడప గడపకు మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మం ద్వారా క‌ల‌వాల‌ని సూచించారు. సంక్షేమ ప‌థ‌కాల‌పై విస్తృతంగా ప్ర‌చారం చేయాల‌ని, విప‌క్షాల త‌ప్పుడు ప్ర‌చారాన్ని తిప్పికొట్టాల‌ని బాలినేని శ్రీ‌నివాస‌రెడ్డి పిలుపునిచ్చారు.   

 ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మాట్లాడుతూ.. గత ఎన్నికలలో వైయ‌స్ జ‌గ‌న్‌ ఆశీస్సులతో వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన నన్ను ప్రతి ఒక్కరూ ఆదరించి నా విజయానికి కృషి చేశార‌ని తెలిపారు.  రాబోయే ఎన్నికలలో కూడా ఆదరించాలని విన్నవించారు. చిన్న చిన్న సమస్యలు కాని, మనస్పర్థలు ఉన్నా మనసులో పెట్టుకోకుండా పార్టీ విజ‌యానికి సహకరించాలని కోరారు.
 తిరుపతి ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని గత ఎన్నికలలో కంటే  అత్యధిక మెజార్టీ సాధించే విధంగా అందరూ కలసికట్టుగా పనిచేయాలని కోరారు. ఇప్పుడు అందుతున్న  సంక్షేమ ఫలాలు ఇలాగే అందాలంటే వైయ‌స్ జ‌గ‌న్ మ‌ళ్లీ ముఖ్యమంత్రి ఉండాలని, అందుకోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

  జిల్లా పార్టీ అధ్యక్షుడు నేదురుమల్లి  రామ్  కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. గతంలో సత్యవేడు పరిశీలకుడుగా ఉన్న నేను ఇప్పుడు జిల్లా అధ్యక్షుడి స్థానంలో ఇక్కడికి రావడం సంతోషంగా ఉంద‌న్నారు.  పని చేసే వారికి కచ్చితంగా గుర్తింపు వస్తుందని అందుకు నేనే నిదర్శనమని ఆయన అన్నారు. అధ్యక్షుడి హోదాలో తిరుపతి జిల్లా నుంచి మొత్తం స్థానాలు మంచి మెజారిటీతో గెలిపించేందుకు కృషి చేస్తామని అందుకు మీ అందరూ సహకారం అందించాలని కోరారు. 

Back to Top