జెండాను గుండెగా మార్చుకున్న నా కార్యకర్తలకు కృతజ్ఞతలు

పార్టీ ఆవిర్భావ దినోత్స‌వ శుభాకాంక్ష‌లు తెలుపుతూ వైయ‌స్ఆర్ సీపీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ ట్వీట్‌

తాడేప‌ల్లి: వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ 13వ వ‌సంతంలోకి అడుగుపెడుతున్న సంద‌ర్భంగా వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి పార్టీ శ్రేణుల‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. పార్టీ ఆవిర్భావ దినోత్స‌వం సంద‌ర్భంగా వైయ‌స్ జ‌గ‌న్ ట్వీట్ చేశారు. ``12 వసంతాలు పూర్తి చేసుకుని, నేడు 13 వ వసంతంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా వైయస్ఆర్ సీపీ అభిమానుల‌కు, కార్య‌క‌ర్త‌ల‌కు, నాయ‌కులకు మరియు రాష్ట్ర ప్రజలందరికీ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్స‌వ శుభాకాంక్ష‌లు. గత 12 ఏళ్లుగా నా ఈ ప్రయాణంలో నాతో నిలబడి, నాకు వెన్నుదన్నుగా ఉన్న ప్రతి ఒక్కరికీ, మన పార్టీ జెండాను తమ గుండెగా మార్చుకున్న నా కార్యకర్తలకు పేరు పేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మన ప్రయాణం ఎప్పటికీ ఇలాగే కొనసాగుతూ ఉండాలని కోరుకుంటున్నాను`` అని పార్టీ అధినేత, ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ ట్వీట్ చేశారు. 

Back to Top