ప్ర‌మాణ‌స్వీకారం చేసిన వైయ‌స్ఆర్ సీపీ నూత‌న ఎమ్మెల్సీలు

అమరావతి: స్థానిక సంస్థల కోటా ఎన్నిక‌ల్లో శాసన మండలికి ఎన్నికైన వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సభ్యులు నర్తు రామారావు, కుడుపూడి సూర్యనారాయణ, కవురు శ్రీనివాస్, వంకా రవీంద్రనాథ్, డాక్టర్‌ ఏ.మధుసూదన్, సిపాయి సుబ్రహ్మణ్యం, మేరుగు మురళీధర్‌, రామసుబ్బారెడ్డిలు ఎమ్మెల్సీలుగా ప్రమాణస్వీకారం చేశారు. శాసనమండలి చైర్మన్‌ కొయ్యే మోషేన్‌రాజు నూతన ఎమ్మెల్సీలతో ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు బూడి ముత్యాల నాయుడు, ధర్మాన ప్రసాదరావు, చెల్లబోయిన వేణుగోపాల‌కృష్ణ‌, మేరుగు నాగార్జున, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, చీఫ్ విప్ ప్రసాద్ రాజు, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top