ఫ్యామిలీ డాక్టర్‌ పథకంతో ప్రజారోగ్యం మరింత మెరుగు 

వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి 

తాడేప‌ల్లి:  ఆంధ్రప్రదేశ్‌ లో ఆడపిల్లల సంఖ్య మగపిల్లలతో పోల్చితే మెరుగవుతున్న పరిస్థితులను ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గారి నేతృత్వంలోని వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం సృస్టిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రధానంగా ఆదివాసీ–గిరిజన ప్రాంతాల్లో జరిగే ప్రసవాలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిపెడుతోంది. పుట్టిన ఆడపిల్లలు ఆరేళ్లు దాటిన తర్వాత కూడా ఆరోగ్యంగా పెరగడానికి రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖతో పాటు వివిధ రకాల ప్రభుత్వ సిబ్బంది కృషిచేస్తున్నారు. ఆదివాసీ మహిళల కాన్పులు ఇళ్లలోగాక ఆస్పత్రుల్లో లేదా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో (పీహెచ్‌ సీలు) జరిగేలా ఆరోగ్య సిబ్బంది చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ లో మగపిల్లల కన్నా ఆడపిల్లల సంఖ్య ఎక్కువ అని, ఈ విషయంలో దేశంలో రెండో స్థానానికి ఈ పెద్ద తెలుగు రాష్ట్రం చేరుకుందని కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ కొద్ది నెలల క్రితం వెల్లడించింది. శ్రామిక శక్తికి (లేబర్‌ ఫోర్స్‌) సంబంధించిన 2021–2022 సర్వే ప్రకారం ఏపీలో ప్రతి వెయ్యి మంది మగపిల్లలకు 2019–20లో 1021 మంది బాలికలు ఉండగా, ఈ సంఖ్య 2021–2022 నాటికి 1046కు పెరిగిందని కేంద్ర ప్రభుత్వ అధికారిక లెక్కలు చెబుతున్నాయి. జాతీయ స్థాయిలో 2021–22లో ఆడపిల్లల సంఖ్య 968 మాత్రమే. ఈ లెక్కన గత నాలుగేళ్లలో పుట్టిన ఆడపిల్లలను జాగ్రత్తగా కాపాడుకునే ప్రయత్నాలు ఫలిస్తున్నాయి.

‘ఫ్యామిలీ డాక్టర్‌’ పథకంతో బాలికల జననాలు సురక్షితం 
 సాధారణంగా ఆరు సంవత్సరాలు నిండిక ముందే బాలికల్లో కొందరు ఆరోగ్య సమస్యలతో కన్నుమూయడం జాతీయ సమస్యగా మారింది. కాని, 2019 జూన్‌ మాసం నుంచి రాష్ట్రంలో వైయ‌స్ఆర్‌సీపీ  ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా సంక్షేమ చర్యల వల్ల ఆడపిల్లలు ఆరోగ్యంగా ఆరేళ్లు దాటి ఎదుగుతున్నారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులకు పోషకాహారం అందజేస్తున్నారు. ఇంకా నెలలు నిండుతున్న మహిళల ఆరోగ్యాన్ని గ్రామ సచివాలయాల ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వారి ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వ సిబ్బంది తోడ్పడుతోంది. ఫలితంగా జననాల సమయంలో ఆడశిశువల సంఖ్య ఇటీవలి సంవత్సరాల్లో అభిలషణీయ రీతిలో ఉంటోంది. కిందటి ఏప్రిల్‌ మాసంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ‘ఫ్యామిలీ డాక్టర్‌’ కార్యక్రమం అమలుతో రోగ నివారణ ప్రక్రియ పకడ్బందీగా జరుగుతుంది. ఈ కొత్త కార్యక్రమం కింద రాష్ట్రంలోని 10,032 డాక్టర్ వైయ‌స్ఆర్‌ హెల్త్‌ క్లినిక్కుల్లో వైద్య సేవలు అందించడం వల్ల జననాల సమయంలో, ఆ తర్వాత బాలికల సంఖ్య పెరుగుతోంది. ఈ కార్యక్రమం ద్వారా ఎంబీబీఎస్‌ డాక్టర్లు ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి పౌరుల ఆరోగ్యాన్ని నిరంతరం గమనిస్తూ వారి ఆరోగ్యాన్ని కాపాడడానికి తమ వంతు కృషి చేయడం వల్ల ఏపీలో ఆడపిల్లల సంఖ్య అనుకున్న రీతిలో పెరుగుతుందని అంచనా. దేశంలో ఇప్పుడు కేరళ తర్వాత ఆంధ్రప్రదేశ్‌ లోనే ఆడపిల్లల సంఖ్య ఎక్కువగా ఉందని కేంద్ర ప్రభుత్వం గణాంకాలు ధ్రువీకరిస్తున్నాయి.

Back to Top