ఆరోపణలకు సమాధానం చెప్పు చంద్రబాబు..!

వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి

తాడేప‌ల్లి: తనపై చేసిన ఆరోపణలకు చంద్రబాబు సమధానం చెప్పాలంటూ వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్‌ చేశారు. ‘‘విశాఖ కంటెయినర్‌లో వెయ్యి టన్నుల డ్రగ్స్‌ దొరికిందంటూ చంద్రబాబు కుట్ర రాజకీయాలల్లో భాగంగా దుష్ప్రచారం చేశారు. రాష్ట్రం గంజాయి, డ్రగ్స్‌ అడ్డాగా మారిపోయిందని రాద్ధాంతం చేశారు. ఓటర్లను మోసగించేందుకు పోలింగ్‌కు నెలన్నర ముందు పెద్దఎత్తున దుష్ప్రచారం చేశాడు’’ అని విజయసాయిరెడ్డి మండిపడ్డారు.

 
‘‘ఇప్పుడు ఆ కంటైనర్‌లో డ్రగ్స్ లేవని కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్ధ ప్రకటించింది.. బ్రెజిల్ అధ్యక్షుడికి, నాకు లింకు పెట్టి మరీ అప్పుడు తప్పుడు ప్రచారం చేసిన చంద్రబాబు, అతని పచ్చకుల మీడియా ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు?’’ అంటూ ఎక్స్‌ వేదికగా విజయసాయిరెడ్డి ప్రశ్నించారు.

Back to Top