‘జయహో బీసీ మహాసభ’ను విజయవంతం చేయండి

వైయస్‌ఆర్‌ సీపీ రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌

కాకినాడ: ఈనెల 7వ తేదీన విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జయహో బీసీ మహాసభను విజయవంతం చేయాలని వైయస్‌ఆర్‌ సీపీ రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ కోరారు. బడుగు, బలహీనవర్గాల ప్రజల కోసం ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారన్నారు. కాకినాడ‌లో ఎంపీ సుభాష్ చంద్ర‌బోస్ విలేక‌రుల స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. బీసీలను సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ముందుకు నడిపించేందుకు సీఎం కృషిచేస్తున్నార‌న్నారు. ప్రత్యేకంగా 56 బీసీ కార్పొరేషన్లను ఏర్పాటు చేసి, చైర్మన్, డైరెక్టర్‌ పదవులు ఇచ్చారన్నారు. అదే విధంగా నలుగురు బీసీలను రాజ్యసభకు పంపించారని చెప్పారు. బీసీల అభ్యున్నతి కోసం ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ పాటుపడుతున్నారని చెప్పారు. బీసీలను చంద్రబాబు కేవలం ఓటు బ్యాంక్‌గానే వాడుకున్నారని మండిపడ్డారు. బీసీల వెన్నెముక విరగొట్టిన వ్యక్తి చంద్రబాబు అని ఎంపీ పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ ధ్వజమెత్తారు. 

Back to Top