విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నాం

ప్లాంట్‌పై లక్ష కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయి

ఏపీపై కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపిస్తుంది

వెనుకబడిన జిల్లాలకు ప్యాకేజీ ఇవ్వాలి

రాజ్యసభలో వైయస్‌ఆర్‌ సీపీ ఎంపీ పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌

ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వంపై సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని వైయస్‌ఆర్‌ సీపీ రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ అన్నారు. కేంద్ర బడ్జెట్‌పై రాజ్యసభలో చర్చ సందర్భంగా వైయస్‌ఆర్‌ సీపీ తరఫున ఎంపీ పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ మాట్లాడారు. కేంద్ర బడ్జెట్‌లో విశాఖ రైల్వేజోన్‌పై ఎలాంటి ప్రస్తావన లేకపోవడం దురదృష్టకరమన్నారు. అదే విధంగా విశాఖ మెట్రో ప్రాజెక్టుకు బడ్జెట్‌లో నిధులు కేటాయించలేదని చెప్పారు. ఏపీకి కిసాన్‌ రైళ్లను ఎక్కువగా నడపాలని కోరారు. మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్‌ చేశారు. అంతేకాకుండా ఏపీలో వెనుకబడిన జిల్లాలకు ప్యాకేజీ ఇవ్వాలని కోరారు. 

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిందని ఎంపీ పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ చెప్పారు. ప్రజలు సుదీర్ఘకాలం పోరాటం చేసిన స్టీల్‌ ప్లాంట్‌ను సాధించుకున్నారని, స్టీల్‌ ప్లాంట్‌ను మూడు దశల్లో పునరుద్ధరించాలని సీఎం వైయస్‌ జగన్‌ ఇప్పటికే లేఖ రాశారని గుర్తుచేశారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌పై లక్ష కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయన్నారు. బకాయిలపై వడ్డీ రుణమాఫీ ప్రకటించాలని, రుణాలను ఈక్విటీగా మార్చాలన్నారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు క్యాప్టిన్‌ మైన్‌లను కేటాయించాలని కోరారు. జాతీయ ఆస్తుల ప్రైవేటీకరణ సమస్యకు పరిష్కారం కాదని ఎంపీ పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ రాజ్యసభలో ప్రస్తావించారు. 

Back to Top