రఘురామ కృష్ణంరాజుది నీచ సంస్కృతి  

దళితులంటే ఆయనకు చిన్నచూపు

దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆయనపై ఎస్పీ కమిషన్‌కు ఫిర్యాదు చేశా

వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ నందిగం సురేష్

తాడేపల్లి: నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఒక నీచ సంస్కృతి కలిగిన వ్యక్తి అని వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ నందిగం సురేష్ వ్యాఖ్యానించారు. రఘురామకృష్ణంరాజు అహంకారంతో మాట్లాడుతున్నారని,  దళితులంటే ఆయనకు చిన్నచూపు అని పేర్కొన్నారు. సెక్యూరిటీతో తనను కాల్చి చంపిస్తానని బెదిరించాడని నందిగం సురేష్ ఆరోపించారు. దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆయనపై ఎస్పీ కమిషన్‌ మెంబర్‌ రాములుకు ఫిర్యాదు చేశానని తెలిపారు. వైయ‌స్ఆర్‌‌సీపీలో గెలిచి ప్రతిపక్షానికి సహకరిస్తున్నారని విమర్శించారు. సోమ‌వారం ఆయ‌న పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. 

దళితులు ఓట్లు వేస్తేనే రఘురామ కృష్ణంరాజు ఎంపీ అయ్యారు..

చెప్పులు కుట్టుకునేవారమని దళిత జాతిపై అసూయ ద్వేషంతో రగులుతూ రఘురామకృష్ణంరాజు కామెంట్లు చేశారు. దళితులు ఓట్లు వేస్తేనే రఘురామ కృష్ణంరాజు ఎంపీ అయ్యారు. ఆయన ఆకాశం నుంచి ఊడి పడలేదు. తన సెక్యూరిటీతో తోలు వలిపిస్తాను,  కాల్చేయిస్తాను అని రఘురామకృష్ణంరాజు మాట్లాడారు. నీకు సెక్యూరిటీ ఇచ్చింది ఎదుటివారి తోలు వలిపించడానికి కాదు. దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రఘురామ కృష్ణం రాజుపై ఎస్సీ కమిషన్ కేసు పెడతామని చెప్పింది. ఎంపీ రఘురామకృష్ణం రాజు సెక్యూరిటీ తొలగించాలని స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తాం. ఆయనకు సెక్యూరిటీ తొలగించే అంతవరకు మా పోరాటం ఆగదు. ఆయన నియోజకవర్గంలో  దళితులు ఆయనకు ఎదురు తిరగడానికి సిద్ధంగా ఉన్నారు. 

 సిగ్గు విడిచి తిరుగుతున్నారు..

కడపలో పదివేల మందితో మీటింగ్ పెడతానని రఘురామ కృష్ణంరాజు చెప్తున్నారు. ఆయన ముక్కును నేలకు రాసి పార్లమెంటులో అడుగు పెట్టాలి. ఢిల్లీలో సిగ్గు విడిచి తిరుగుతోన్న వ్యక్తి రఘురామకృష్ణంరాజు. మేము ఎప్పుడూ ఎవరినీ మోసం చేయలేదు నిజాయితీగా బతుకుతున్నాం. ఆయన బ్యాంకులకు అప్పులు ఎగ్గొట్టి, బ్యాంకు లూటీ చేసి  ఆస్తులు సంపాదించాడు. త్వరలోనే తిరిగి నీవు వాస్తవ పరిస్థితికి వస్తావు. ఆయనకు బుద్ది చెప్పేందుకు దళిత సంఘాలు సిద్దంగా ఉన్నాయ‌ని ఎంపీ నందిగం సురేష్‌ పేర్కొన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top