లడ్డూ వివాదం చంద్రబాబు సృష్టించిన రాజకీయ కుట్రే

సీబీఐ సిట్ నివేదికతో వెల్లడైన వాస్తవాలు

అడ్డంగా దొరకడంతో శ్రీశైలం పేరుతో దుష్ప్రచారం

దేవుళ్లని రాజకీయాలకు వాడుకుంటున్న నీచ నైజం

చంద్రబాబు పై నిప్పులు చెరిగిన వైయస్ఆర్‌సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి

కర్నూలు వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన వైయస్ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్ వీ మోహన్ రెడ్డి.

బోలేబాబాకు బాబు హయాంలోనే అనుమతులు

వైయస్.జగన్ హయాంలో నెయ్యి టెండర్లపై విమర్శలు

తక్కువ ధరకు కల్తీ నెయ్యి కొన్నారంటూ కూటమి నేతల గగ్గోలు

వైయస్.జగన్ హయాంలో నెయ్యి సేకరణ ధర  కేజీ రూ.320

మరి బాబు పాలనలో రూ.291కే కేజీ ఎలా సాధ్యం

అప్పుడు నెయ్యి కల్తీ కాలేదా ?

సూటిగా నిలదీసిన ఎస్ వీ మోహన్ రెడ్డి?

ప్రసాదంపై ఆరోపణలో స్వామి ప్రతిష్టను మసకబార్చిన బాబు

శ్రీవారి ఆలయ నిర్మాణంతో ప్రపంచవ్యాప్తంగా ప్రతిష్ఠ పెంచిన వైయస్.జగన్

స్పష్టం చేసిన ఎస్ వీ మోహన్ రెడ్డి.

కర్నూలు: తిరుమల లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు చేస్తున్న ఆరోపణలు కేవలం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా దెబ్బతీసేందుకు పన్నిన కుట్ర అని వైఎస్సార్సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షులు ఎస్వీ మోహన్ రెడ్డి మండిపడ్డారు. కర్నూలు వైయస్ఆర్‌సీపీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... లడ్డూ వివాదంపై సిట్ దాఖలు చేసిన ఛార్జిషీట్ లోని కీలక ఆధారాలను బయటపెట్టారు.2024లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే కల్తీ నెయ్యి సరఫరా జరిగితే.. వైయస్.జగన్ కి, వైయస్ఆర్‌సీపీ ఏమి సంబంధం అని నిలదీశారు.  నాణ్యత లేదని టీటీడీ తిరస్కరించిన నెయ్యినే మరలా టీడీపీ నేతల ఒత్తిడితో వెనక్కి రప్పించి లడ్డూ ప్రసాదంలో వాడారన్న సిట్ నివేదికపై ఏం సమాధానం చెపుతారని నిలదీశారు. లడ్డూలో జంతు, పంది కొవ్వు కలవలేదని సీబీఐ ఛార్జి షీట్ దాఖలు చేయడంతో ఇప్పుడు చంద్రబాబు శ్రీశైలం లడ్డూ ప్రసాదంపై ఆరోపణలు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. లడ్డూలో బాత్రూమ్ క్లీనింగ్ కెమికల్స్ కలిశాయని మాట్లాడటానికి చంద్రబాబుకు మనసెలా ఒప్పిందని నిలదీశారు.  కూటమి పాలనలో వరుస ఆలయాల్లో అపచారాలు, తొక్కిసలాటలు, శ్రీశైలంలో భక్తులపై లాఠీచార్జీ ఘటన ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని తేల్చి చెప్పారు. ఇప్పటికైనా చంద్రబాబు దేవదేవుడికి, భక్తులకి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇంకా ఏమన్నారంటే...

● సిట్ ఛార్జిషీట్ తో బాబు కుట్ర బట్టబయలు..

లడ్డూ వివాదాన్ని కూటమి ప్రభుత్వం రోజుకొక మలుపు తిప్పుతోంది. తిరుమల లడ్డూపై ఇప్పటికే అత్యంత దుర్మార్గమైన ప్రచారం చేసిన చంద్రబాబు.. మరలా ఇప్పుడు కొత్తగా శ్రీశైలం లడ్డూని కూడా వివాదాస్పదం చేశారు. 2024 జూన్ లో చంద్రబాబు హయాంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే లడ్డూ వివాదం వెలుగుచూసింది. 2024 జూలై 6న రెండు ట్యాంకర్లు, జూలై 12న వచ్చిన మరో 2 ట్యాంకర్ల నెయ్యి నాణ్యతా పరీక్షలో విఫలం కావడంతో టీటీడీ ఆ నెయ్యిని కూలై 25న వెనక్కి పంపించిన ఘటన చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే జరిగింది. టీటీడీ తిరస్కరించిన నెయ్యిని శ్రీకాళహస్తి లోని ఒ క్రషర్ వద్ద ఉంచి... మరలా దొడ్డి దారిన ఆ నెయ్యిని వెనక్కి తెచ్చి వైష్టవి డెయిరీ తరపున తప్పుడు ఇన్ వాయిస్ లతో సరఫరా చేస్తే.. ఆ కల్తీ అయిన నెయ్యినే లడ్డూల తయారీలో వాడారు. కల్తీ అయిందని తేలిన తర్వాత వెనక్కి పంపిస్తే.. కేవలం టీడీపీ నేతల ఒత్తడితో మరలా దాన్నే సరఫరా చేసి, దాన్నే లడ్డూల తయారీలో వాడారన్న విషయాన్ని కూడా సీబీఐ సిట్ అధికారులు 23-01-2026న ఛార్జిషీట్ లో ప్రస్తావించారు. 
కల్తీ నెయ్యి పట్టుబడింది చంద్రబాబు ప్రభుత్వంలోనే, దాన్ని వెనక్కి పంపించిందీ మీ హయాంలోనే, తిరిగి అదే నెయ్యిని దొంగమార్గంలో తప్పుడు పత్రాలకూ మరలా తిరుమలకు తరలించి అదే నెయ్యితో లడ్డూలు తయారు చేసింది కూడా మీ ప్రభుత్వ హయాంలోనే అయితే... ఈ వ్యవహారంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి, వైయస్.జగన్ కి ఏమి సంబంధం?
పైగా సిట్ అధికారులు చంద్రబాబు ఆరోపించినట్లు లడ్డూ ప్రసాదంలో ఎలాంటి జంతుకొవ్వులు, పందికొవ్వులు కలవలేదని కోర్టుకు సమర్పించిన ఛార్జ్ షీట్ లో నివేదించారు. అలాంటప్పుడు బాధ్యతగల ముఖ్యమంత్రిగా ఉన్న మీరు మీ పార్టీ సమావేశంలో  జంతుకొవ్వులు, పందికొవ్వులు కలిసాయని ఏ విధంగా చెబుతారు? పైగా దీనిపై విచారణ చేసిన సీబీఐ అధికారులు ప్రసాదంలో ఎలాంటి జంతు, పందికొవ్వులు కలవలేదని నివేదిక ఇస్తే ..  ప్రజలకు, దేవదేవుడికి చంద్రబాబు బహిరంగ క్షమాపణ చెప్పి ఉండాల్సింది. అలా చేయలేని పక్షంలో మనసులోనైనా క్షమాపణ చెప్పుకుని.. అంతటితో లడ్డూపై దుష్ప్రచారానికి పుల్ స్టాప్ పెట్టాలి. కానీ అలా చేయకుండా ఎల్లో మీడియాను అడ్డంపెట్టుకుని లడ్డూపై తప్పుడు ప్రచారం చేస్తూనే ఉన్నాడు. కేవలం వైయస్ఆర్‌సీపీనీ వైయస్.జగన్ ని రాజకీయంగా దెబ్బకొట్టడానికే ఒకే అబద్దాన్ని వందసార్లు వందరకాలుగా చెబుతున్నాడు.

● సామర్ధ్యం లేకపోతే మీ హాయంలో బోలేబాబాకు ఎలా ఇచ్చారు?

సిట్ నివేదికలో ఎక్కడా టీటీడీ మాజీ చైర్మన్ లుగా పనిచేసిన మా పార్టీ నేతలు వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి పేర్లు సైతం ప్రస్తావించలేదు. అయినా వారు క్షమాపణ చెప్పాలని కోరుతున్నారు. 2019 మార్చి నెలలో బోలేబాబాకు టెక్నికల్ క్వాలిఫికేషన్ కి అనుమతులు ఇచ్చింది చంద్రబాబు హయాంలోనే. అప్పుడే మార్చి 6 వ తేదీనే కేజీ రూ.291 చొప్పున 82 వేల కేజీల నెయ్యి సరఫరాకు అంగీకారం తెలిపారు. వైయస్.జగన్ ప్రభుత్వ హయాంలో కేజీ నెయ్యి రూ.320 చొప్పున ఇస్తే.. అంత తక్కువ ధరకు నెయ్యి వస్తుందా అని ప్రశ్నించిన పవన్ కళ్యాణ్, కూటమి నేతలు, ఇదే టీడీపీ ప్రభుత్వ హయాంలో అంతకంటే తక్కువకు ఎలా ఇచ్చారు?మరలా ఏప్రిల్ 19న మరో 12,300 కేజీల నెయ్యి సరఫరాకు కూడా బోలేబాబాకు ఆనుమతులు జారీ చేశారు. ఇవాళ నెయ్యి సరఫరా చేసే సామర్ధ్యం బోలేబాబాకు లేదని చెబుతున్న కూటమి నేతలు.. ఇదే బోలేబాబాకు 2019లో నెయ్యి సరఫరాకు ఎలా ఆర్డర్లు ఇచ్చారు.  దీనికి చంద్రబాబు సమాధానం చెప్పాలా? వైయస్.జగన్ సమాధానం చెప్పాలా? 
మరోవైపు 2019లో వైయస్.జగన్ నెయ్యి సరఫరా నిబంధనలు సరళతరం చేసామని చెబుతున్న కూటమి నేతలు ..  తమ హయాంలో 2019లో నిబంధనలను కఠినతరం చేశామని చెబుతున్నారు. అంటే 2014- 19 వరకు నిబంధనలు సరళంగా ఉన్నాయని మీరు అంగీకరించినట్లే కదా? 

● రూ.320 కేజీ సాధ్యమా అంటూ రూ.291కే ఎలా ఇచ్చారు?

మరోవైపు సీబీఐ సిట్ ఛార్జిషీట్ లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రీమియర్ ఆగ్రీ పుడ్స్ రూ.320లకే కేజీ నెయ్యిని 2019 నుంచి సరఫరా చేస్తుందని స్పష్టం చేసింది. మరి ఇవాళ రూ.320కే కేజీ నెయ్యి దొరుకుతుందా అంటూ ఆంధ్రరాష్ట్ర ప్రజలకు అనుమానం వచ్చేలా పదే పదే మాట్లాడుతూ... ప్రజలకు అపోహ కలిగించిన చంద్రబాబు.. 2016 నుంచి 2018 వరకూ రూ.321, రూ.364, రూ.273లకే ఏ విధంగా కేజీ నెయ్యి సరఫరాకి టెండర్లు అప్పగించారు. 2018 జనవరిలో కూడా రూ.320కే కొనుగోలు చేశారు. వైయస్.జగన్ హయాంలో 2021లో కేజీ నెయ్యి రూ.321 లకు కొనుగోలు చేశారు. మీ హయాంలో రూ.291కి కొంటే కరెక్ట్, వైయస్.జగన్ రూ.320 కొంటే తక్కువకు కొన్నట్టా? మీరు మతి ఉండే మాట్లాడుతున్నారా చంద్రబాబూ? మీడియా మీ చేతుల్లో ఉందని అబద్దాన్ని నిజం చేయాలని ప్రయత్నిస్తున్నారు. తిరుపతిలో చంద్రబాబు మాటలను ప్రజలకు నమ్మకపోవడంతో శ్రీశైలం లడ్డూలో కూడా బాత్రూమ్ క్లీనింగ్ కెమికల్స్ కలిసాయని ఆరోపిస్తున్నాడు. సాక్ష్యం ఏది అని ప్రశ్నిస్తే.. ఈనాడు పత్రికలో వచ్చిందని చెబుతున్నాడు. ఈనాడు పత్రిక భగవద్గీతో, ఖురానో, బేబిలో కాదు. ముఖ్యమంత్రి స్దాయి వ్యక్తి రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మక ఆలయాల్లో తిరుపతి తర్వాత స్ధానంలో ఉన్న శ్రీశైలం లడ్డూ పై కూడా వాడకూడని భాష వాడడానికి చంద్రబాబుకి నోరెలా వచ్చింది? అత్యంత నిష్టతో ఉన్న వ్యక్తులు, పీఠాధిపతులు, మఠాధిపతులు తినే ప్రసాదంపై అంత నీచమైన ప్రచారం ఎలా చేశావు చంద్రబాబూ? సీఎం స్ధాయిలో మాట్లాడితే అదే నిజమని ఎంతో క్షోభకు గురై ఉంటారు. సీబీఐ సిట్ ద్వారా నిజాలు తెలియడంతో వారంతా ఊపిరి పీల్చుకున్నారు. తన ఎత్తుగడ పారకపోవడంతో చంద్రబాబు ఈ దఫా శ్రీశైలం లడ్డూ ప్రసాదంపై ఆరోపణలు చేస్తూ.. లడ్డూ ప్రసాదంలో బాత్రూమ్ క్లీనింగ్ కెమికల్స్ కలిపారని పచ్చి అబద్దాలు మాట్లాడారు. అదే నిజమైతే బాత్రూమ్ యాసిడ్స్ ప్రభావంతో ఎంతోమంది అనారోగ్యం పాలవడమో, చనిపోవడమో జరగాలి. కానీ అలాంటిదేమీ లేదు. చంద్రబాబు ఈ వయస్సులో భక్తుల మనోభావాలను అబద్దపు ప్రచారాలతో ఆడుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. కేవలం వైయస్.జగన్ ని జనంలో దోషిని చేయాలన్న దురుద్దేశ్యంతోనే తిరుపతి, శ్రీశైలం లడ్డూలపై ఈ రకంగా దిగజారుడు ప్రచారం చేయడం సరికాదు. రాజకీయాల్లో తిరుమల వెంకన్నను, శ్రీశైలం మల్లన్నను లాగితే పుట్టగతులు లేకుండా పోవడం ఖాయమని హెచ్చరించారు.

● బాబు పాలనలో 44 ఆలయాలు కూల్చివేత...

చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆలయాల్లో వరుస అరాచకాలు జరుగుతున్నాయి. తిరుమల చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా, ఎన్ని ప్రభుత్వాలు మారినా గతంలో తొక్కిసలాటలు జరగలేదు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాతే వైకుంఠఏకాదశి రోజున, సింహాచలంలోనూ గతంలో ఎప్పుడూ లేని విధంగా భక్తులు చనిపోయారు. తాజాగా నిన్న శ్రీశైలం మల్లన్న దర్శనానికి వచ్చిన శివస్వాముల మీద లాఠీ ఛార్జీకి పాల్పడ్డారు. భక్తుల పట్ల మీరు వ్యవహరిస్తున్న తీరుకు ఇదే నిదర్శనం. గతంలో మీ ఆర్బాటాల కోసం రాజమండ్రిలో గోదావరి పుష్కరాల కోసం షూటింగ్ నిర్వహించగా.. తొక్కిసలాటలో అమాయక భక్తులు చనిపోయారు.మీ హయాంలో విజయవాడలో రోడ్డు నిర్మాణం కోసం 44 ఆలయాలను కూల్చి వేసిన ఘనత మీ ప్రభుత్వానిదే చంద్రబాబూ. తిరుపతిలో తిరుమల వెల్లే దారిలో బిర్యానీ హోటల్ కి అనుమతులు ఇచ్చింది కూడా మీరే బాబూ? 

వైయస్.జగన్ హయాంలో దేశవ్యాప్తంగా కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయాల నిర్మాణం చేపట్టారు. అమెరికాలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి టీటీడీ తరపున సహకారం అందించారు.  విశాఖపట్నంతో పాటు కాశ్మీర్, ముంబాయి,  పశ్చిమ బెంగాల్ లో ఆలయాలు నిర్మించి.. ఆయన ప్రాభవాన్ని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లారు. ప్రపంచవ్యాప్తంగా స్వామి వారి ఆలయాలను నిర్మించడం ద్వారా వైయస్.జగన్ శ్రీవారి ప్రాభవాన్ని పెంచితే.. లడ్డూలో జంతుకొవ్వు కలిసిందని ఆరోపించడం ద్వారా  స్వామి వారి ప్రతిష్టను మసకబారేలా చేసిన చరిత్ర నీదేనని గుర్తు పెట్టుకో చంద్రబాబూ? ఇంకా లడ్డూ వివాదాన్ని రకరకాల మలుపులు తిప్పుతూ.. ఏకసభ్య కమిషన్ పేరుతో మరో విచారణకు సిద్ధమవడాన్ని ఎస్ వీ మోహన్ రెడ్డి తప్పుపట్టారు. ఇప్పటికైనా స్వామి వారి లడ్డూపై  దుష్ప్రచారం చేస్తూ ఆయన ప్రతిష్టకి భంగం కలిగించే పనులు చేయొద్దని చంద్రబాబుని హెచ్చరించారు.

Back to Top