ప్రజాక్షేత్రంలో బహిరంగ చర్చకు సిద్ధమా..?

చంద్రబాబు, లోకేష్‌లకు ఎంపీ నందిగం సురేష్‌ సవాల్‌

అమరావతిలో అన్ని విషయాలపై చర్చకు నేను సిద్ధం

ప్రపంచ రాజధాని పేరు `అల చంద్రాపురం.. అల కే–పురం` అని పెట్టుకోండి

పేదల ఇళ్లంటే టీడీపీ నేతలకు అంత చులకనా..?

పేదలంటేనే చంద్రబాబుకు, టీడీపీ నేతలకు కడుపుమంట

వైయస్‌ జగన్‌ ప్రభుత్వంలో పేదవాడే మహరాజు

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ నందిగం సురేష్‌

తాడేపల్లి: ఎవరో రాసిచ్చిన డైలాగులతో కూతలు కూయడం కాదు.. అమరావతిపై బహిరంగ చర్చకు వస్తే వాస్తవాలేమిటో తేలుద్దామని, ఎవరు రియలెస్టేట్‌ వ్యాపారం చేశారో అమరావతి ప్రజల సమక్షంలో బహిరంగ చర్చకు సిద్ధమా అని చంద్రబాబు, లోకేష్‌కు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ ఎంపీ నందిగం సురేష్‌ సవాల్‌ విసిరారు. అమరావతిలో ఎవరు భూములు కొన్నారు.. ఎవరికి మేలు చేకూర్చేలా చంద్రబాబు హయాంలో నిర్ణయాలు తీసుకున్నారు.. ఎవరు బాగుపడ్డారు.. ఏ సామాజికవర్గం రియలెస్టేట్‌ చేసింది.. వీటన్నింటిపై చర్చించేందుకు తాను సిద్ధంగా ఉన్నానన్నారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 31 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాతలు ఇస్తుంటే.. ఈ రోజు రాష్ట్రంలో ప్రజలు క్రిస్మస్, సంక్రాంతి పండుగలు ఒకేసారి వచ్చినంత ఆనందంగా సంబరాలు చేసుకుంటున్నారన్నారు. 

తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎంపీ నందిగం సురేష్‌ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘అమరావతిలో ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు, మైనార్టీలు అందరూ ఉండాలనుకున్నప్పుడు 54 వేల మంది పేదలకు ఇళ్ల పట్టాలు రాకుండా చంద్రబాబు, టీడీపీ నేతలు కోర్టుకెళ్లి ఎందుకు అడ్డుకున్నారని ప్రశ్నించారు. డెమోగ్రాఫిక్‌ ఇంబ్యాలెన్స్‌ వస్తుందని కోర్టులో ఎందుకు వాదనలు చేశారని నిలదీశారు. అమరావతిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, పేదలు ఉండాలనుకుంటే.. ముందుగా కోర్టుల్లో స్టేలు వెకేట్‌ చేయించి మాట్లాడాలని చంద్రబాబుకు సూచించారు.  

అమరావతిలోని 29 గ్రామాల పేదల గురించి మాట్లాడే హక్కు టీడీపీ నేతలకు, జేఏసీ నేతలకు లేదన్నారు. ఎందుకంటే వీరంతా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాల కోసం, చంద్రబాబు బినామీల ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్యమం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు నిర్మిస్తానని చెప్పిన ప్రపంచ రాజధాని అమరావతి పేరు.. అలా చంద్రపురం అనో.. అలా కే–పురం అనో పెట్టుకుంటే బాగుండేదన్నారు. అమరావతి చంద్రబాబు రాజధానే తప్ప.. రాష్ట్ర ప్రజల రాజధాని కాదన్నారు.  పొద్దున లేస్తే ఏసీ కార్లలో తిరుగుతూ, నిత్యం ఏసీల్లో ఉండే రియస్‌ ఎస్టేట్‌ వ్యాపారులు.. అమరావతి జేఏసీ ముసుగులు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. 

ప్రభుత్వం పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తుంటే.. టీడీపీ నేతలు బాత్‌ రూంల్లాంటి ఇళ్లు అని అవమానిస్తారా..? పేదల ఇళ్లంటే మీకు అంత చులకనా..? పేదలంటే మీ రక్తంలో నిలువెల్లా విషం నింపుకోబట్టే, పేదల చెమట వాసన మీకు నచ్చదు. పేదవాడు ఎప్పటికీ మురికి కాలువ పక్కన, ఊరికి దూరంగా నివసించాలన్నట్టుగా టీడీపీ నేతల దుష్ట ఆలోచనలు ఉన్నాయని ఎంపీ సురేష్‌ మండిపడ్డారు. 
 
రాష్ట్రంలో 31 లక్షలు ఇళ్లు పేదలకు కట్టి.. 17 వేల ఊళ్లు కొత్తగా ఏర్పడిన తర్వాత చంద్రబాబు ఇంకెక్కడికి పారిపోతాడో..? చంద్రబాబుకు ఆంధ్రప్రదేశ్‌లో అసలు సొంత ఇల్లు ఉందా..? ఈ రాష్ట్రంలో చంద్రబాబుకు అడ్రసే లేదు. వలస ప్రయాణికుల్లా, టూరిస్టుల్లా చంద్రబాబు, లోకేష్‌లు అమరావతికి వస్తున్నారన్నారు. రెండు ఎకరాల నుంచి రూ. 2 లక్షల కోట్లకు చంద్రబాబు, లోకేష్‌ ఆస్తులు పెరిగాయని, పేదల గురించి మాట్లాడే వీళ్లు ఆ కిటుకు ఏంటో పేదవాడికి కూడా చెబితే వారు కూడా బాగుపడతారన్నారు. ఆఖరికి లోకేష్‌ కుమారుడికి కూడా వందల కోట్లు ఆస్తులు ఉన్నాయి. ఆయన ఏ బిజినెస్‌ చేసి వందల కోట్లు సంపాదించాడని ప్రశ్‌నించారు.  

విదేశాల్లో చదువుకున్నాని చెప్పే లోకేష్‌కు ఇంగ్లీషు రాదు, తెలుగు రాదు, డెమోగ్రాఫిక్‌ ఇం బ్యాలెన్స్‌ అంటే అర్థం కూడా తెలియకుండా నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడని ఎంపీ నందిగం సురేష్‌ మండిపడ్డారు. ఇకనైనా బుద్ధిహీనమైన ఆలోచనలు మానుకోండి. పనికిమాలిన కుట్రలతో రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీయొద్దని, ఇప్పటికైనా డ్రామాలు ఆపాలని, పేదవాడిని బతకనివ్వాలని చంద్రబాబు, లోకేష్‌ను కోరారు. 

అమరావతి చంద్రబాబు బినామీల రాజధాని అని ఎంపీ నందిగం సురేష్‌ అన్నారు. అమరావతిలో ఎక్కడ ఎవరు భూములు కొన్నారో చర్చిద్దాం.. చంద్రబాబు బినామీల రాజధాని కాదని నిరూపించే ధైర్యం ఉంటే బహిరంగ చర్చకు రావాలని చంద్రబాబు, లోకేష్‌లకు సవాల్‌ విసిరారు. అమరావతిలో పేదలు ఉండాలని భావిస్తే.. కోర్టులో వేసిన కేసులను తక్షణం విత్‌డ్రా చేసుకోవాలని డిమాండ్‌ చేశారు. 54 వేల మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు సహకరించాలని కోరారు. పేదవాడు అంటే చంద్రబాబుకు, తెలుగుదేశం పార్టీ నేతలకు కడుపు మంట అని, పేదవాడు శుభ్రంగా బట్ట కట్టుకున్నా, కడుపు నిండా అన్నం తిన్నా, ఇంగ్లీషు మీడియం చదువుకున్నా వాళ్లకు నచ్చడం లేదన్నారు. అందుకే పేదవాడు ఎప్పటికీ పేదవాడిగా ఉండాలని కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు. 

సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వంలో పేదవాడే మహరాజు అని ఎంపీ నందిగం సురేష్‌ అన్నారు. ఇది పేదల ప్రభుత్వం అని, వైయస్‌ జగన్‌ పేదలపాలిట దేవుడిలా కనిపిస్తున్నారన్నారు. ఇవాళ ప్రతి పేదవాడు నాకు సొంత ఇల్లు ఏర్పాటవుతుంది, మా ఇంట్లో మేము ఉండవచ్చు, జగనన్న దీవెనతో పిల్లలు చక్కగా చదువుకుంటారు.. అనే ఆలోచనతో రాష్ట్రప్రజలందరూ కూడా సంబరాలు చేసుకుంటున్నారని చెప్పారు. అమరావతిలో గతంలో అరటి తోటలు తగులబెట్టిన కేసులను తేల్చాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ను కలిసి కోరుతానని, అసలైన కుట్రదారులు ఎవరు, పాత్రదారులెవరో తేల్చాలని సీఎంను కోరనున్నట్లు ఎంపీ నందిగం సురేష్‌ తెలిపారు. 
 

తాజా వీడియోలు

Back to Top