సుజనా చౌదరి ఎవరంటే బ్యాంకు దొంగ అంటారు

ఎంగిలి మెతుకులకు ఆశపడి మాట్లాడవద్దు సుజనా..

ఏపీలో టీడీపీ చచ్చిపోయింది..భవిష్యత్‌లో బతికే పరిస్థితి లేదు

ఇంగ్లీష్‌ మీడియంపై ప్రతిపక్షాలు లేనిపోని రాద్ధాంతం 

ఎంపీ నందిగాం సురేష్‌

న్యూఢిల్లీ: రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి ఎవరంటే బ్యాంకు దొంగ అని చెబుతారని, గూగుల్‌ కూడా ఇదే చెబుతుందని వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ నందిగాం సురేష్‌ పేర్కొన్నారు. వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలు టచ్‌లో ఉన్నారన్న సుజన వ్యాఖ్యలను ఆయన తిప్పికొట్టారు. ఢిల్లీలో శుక్రవారం మీడియాతో మాట్లాడిన సురేష్‌ చంద్రబాబు, సుజనా చౌదరిలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ..సుజనా చౌదరి టీడీపీ నుంచి చాటుమాటున బీజేపీలో చేరారని చెప్పారు. సుజన చౌదరి అని ఎవరిని అడిగినా ఆయన ఓ బ్యాంకు దొంగ అని చెబుతారన్నారు. అసలు ఆయన ఒరిజనల్‌ బీజేపీనా? డూప్లికేట్‌నా అన్నది అర్థం కావడం లేదన్నారు. మాకు రెండు పూటల ఫుడ్‌ దొరికితే చాలు అనుకుంటామని, నీలాగా బ్యాంకులకు ఎగ్గొట్టాలని మాకు లేదన్నారు. ఓ కార్యకర్తను ఎంపీని చేసిన ఘనత వైయస్‌ జగన్‌ది అన్నారు. ఆ సీటుకు వంద మంది పోటీ పడినా కూడా పేదొడికి సీటు ఇచ్చి గెలిపించారన్నారు. అలాంటి సుజనా చౌదరి వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలు మాకు టచ్‌లో ఉన్నారని చెప్పడం దారుణమన్నారు. ప్రజలకు మేలు చేసే ఆలోచన లేని సుజనా చౌదరికి వేరే పార్టీ ఎంపీలు టచ్‌లో ఉంటారా అన్నారు. సుజనా చౌదరి రాజ్యాంగాన్ని బ్రేక్‌ చేస్తున్నారని అంటున్నారని, ఆయన ఒక పార్టీ తరఫున ఎన్నికై వేరే పార్టీలో చేరడం రాజ్యాంగబద్ధమా అన్నారు. వైయస్‌ జగన్‌కు మేమందరం అండగా ఉంటే వేలెత్తి చూపుతున్నారన్నారు. పేదలకు మేలు చేసేందుకు వైయస్‌ జగన్‌ ఇంగ్లీష్‌ మీడియంప్రవేశపెడితే రాద్దాంతం చేస్తున్నారన్నారు. మీరు విదేశాలకు వెళ్లి బెంజీ కారులో తిరుగుతుంటే పేదల పిల్లలు అలా తిరుగకూడదా అన్నారు. సుజనా ..నీ ఆటలు సాగవన్నారు. నీపై విచారణ జరుగకుండా ఉండేందుకు పార్టీ మారావన్నారు. చంద్రబాబును కాపాడేందుకు పని చేస్తున్నారని విమర్శించారు. టీడీపీ అన్నది ఏపీలో చనిపోయిందన్నారు. దాన్ని బతికించేందుకు విశ్వ ప్రయత్నాలు చేసినా ఫలితం ఉండదన్నారు. చంద్రబాబు, నీవు జైలుకు వెళ్లకుండా బీజేపీతో కలిసి వెళ్తున్నారన్నారు. వైయస్‌ జగన్‌కు ఒక సిద్ధాంతం ఉందన్నారు. మా పార్టీ ఒక ఆశయంతో ఏర్పాటైందన్నారు.  టీడీపీకి ప్రజలు బుద్ధి చెప్పినా వారికి అర్థం కావడం లేదన్నారు. సుజనా చౌదరి మాపై ఇలాంటి కామెంట్లు చేస్తే పరిస్థితులు మరొ రకంగా ఉంటాయని హెచ్చరించారు. ఏపీని చంద్రబాబు సూట్‌కేసుల దోచుకున్నారన్నారు. వైయస్‌ జగన్‌ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషి చేస్తున్నారని, ఆయన అడుగు జాడల్లో నడుస్తామని చెప్పారు. వైయస్‌ జగన్‌ మాకు దైవంతో సమానమని ఎంపీ నందిగాం సురేష్‌ పేర్కొన్నారు.

 Read Also: మేం తలుపులు తెరిస్తే టీడీపీ ఖాళీ

Back to Top