చంద్రబాబుపై క్రిమినల్‌ కేసు పెట్టాలి

సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ముందు నారా లోకేష్ ఓ బ‌చ్చా..

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ మార్గాని భరత్‌ రామ్‌ 

విజయవాడ: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై పారిశ్రామిక వేత్తలు పూర్తి విశ్వాసంతో ఉన్నారని, అందుకే అంబానీ, అదానీ లాంటి దిగ్గజ పారిశ్రామిక వేత్తలు ఏపీలో పెట్టుబడులు పెడుతున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ మార్గాని భరత్‌రామ్‌ అన్నారు. విశాఖ వేదికగా రెండ్రోజుల పాటు జరిగిన గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌–2023 విజయవంతమైందని, రూ.13 లక్షల కోట్ల ఎంవోయూలు జరగడం ఇదే ప్రథమమన్నారు. ఎంపీ భరత్‌ మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వంతో వివిధ కంపెనీలు చేసుకున్న ఒప్పందాల ద్వారా దాదాపు 6 లక్షల పైచిలుకు మందికి ఉపాధి లభించనుందన్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం పారిశ్రామికాభివృద్ధి దిశగా ముందుకెళ్తుందన్నారు. 

ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముందు నారా లోకేష్‌ ఒక పిల్ల బచ్చా అని ఎంపీ మార్గాని భరత్‌ ఎద్దేవా చేశారు. పోలవరం ప్రాజెక్టులో కాఫర్‌ డ్యామ్‌ నిర్మించకుండా డయాఫ్రమ్‌ వాల్‌ కడితే పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఏం పనిచేస్తుందని ప్రశ్నించారు. గత టీడీపీ ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందని, ఇంత పెద్ద పొరపాటు చేసిన చంద్రబాబుపై క్రిమినల్‌ కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. 
 

Back to Top