వైయస్‌ జగన్‌ ప్రభంజనం అడ్డుకోవడానికి చంద్రబాబు కుట్రలు

జనసేన.. టీడీపీ తొత్తు పార్టీ

వైయ జగన్‌కే ప్రజల మద్దతు 

వైయస్‌ఆర్‌సీపీ రాజమండ్రి పార్లమెంటు అభ్యర్థి మార్గాని భరత్‌

తూర్పుగోదావరి: వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభంజనాన్ని అడ్డుకోవడానికి అన్ని పార్టీలు కుమ్మక్కై ప్రయత్నాలు చేస్తున్నాయని వైయస్‌ఆర్‌సీపీ రాజమహేంద్రవరం పార్లమెంటు అభ్యర్థి మార్గాని భరత్‌ అన్నారు.ప్రజలు వైయస్‌ జగన్‌ పక్షాన ఉన్నారన్నారు. జనసేన పార్టీ పూర్తిగా టీడీపీకి తొత్తుపార్టీగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. పవన్‌కల్యాణ్‌ టీడీపీ పాలనలోని లోపాలను  విమర్శించకుండా ప్రతిపక్ష నేతను విమర్శించడం  ప్రజలందరూ గమనిస్తున్నారని,టీడీపీ,జనసేన లోపాయికారీ ఒప్పందాన్ని ప్రజలందరూ ఈసడించుకుంటున్నారని తెలిపారు.పవన్‌కల్యాణ్‌..చంద్రబాబును కాపాడే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు వ్యతిరేక ఓట్లను చీల్చే కార్యక్రమాన్ని జనసేన,ప్రజాశాంతి పార్టీలు చేస్తున్నాయని విమర్శించారు.

Back to Top