సుజనా చౌదరిపై ఎథిక్స్‌ కమిటీకి ఫిర్యాదు చేస్తా

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ బాలశౌరి
 

ఢిల్లీ: సుజనా చౌదరి డూప్లికేట్‌ బీజేపీ నేత అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ బాలశౌరి అన్నారు. సుజనా చౌదరి వైఖరిపై ఎంపీ బాలశౌరి మండిపడ్డారు. సుజనాకు సూటిగా ప్రశ్నలు సంధించారు. సుజనా బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా..? మీకు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా..? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా..? ప్రధానమంత్రి నరేంద్రమోడీకి వ్యతిరేకంగా ధర్మదీక్షలు చేసింది నువ్వు కాదా సుజనా అని ప్రశ్నించారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా – సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భేటీ గురించి నిజమైన బీజేపీ నేత జీవీఎల్‌ నర్సింహారావు వివరించారన్నారు. సుజనా డూప్లికేట్‌ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నాడన్నారు. పొలిటికల్‌ బ్రోకర్, డూప్లికేట్‌ బీజేపీ నేత సుజనా మాటలకు విలువ లేదన్నారు. సుజనా చౌదరిపై ఎథిక్స్‌ కమిటీకి ఫిర్యాదు చేస్తానన్నారు. ఇప్పటికే జీవీఎల్‌ కూడా సుజనాపై ఫిర్యాదు చేశారని గుర్తు చేశారు. బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్‌లో ప్రైవేట్‌ బిల్లు పెడతామన్నారు.

Read Also: జగన్‌తో పేచీ..చంద్రబాబుతో లాలూచీ..ఇదే పవన్‌యిజం

Back to Top