డబ్బు, వారసత్వ రాజకీయాలకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చోటులేదు

ముదళియార్ కుల ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్సీలు లేళ్ళ‌ అప్పిరెడ్డి, జంగా కృష్ణమూర్తి

బీసీలంతా వైయస్ జగన్ వెంటే ఉన్నారు 

బలహీనవర్గాల అభ్యున్నతి కోసం ప్రణాళికబధ్దంగా పనిచేస్తున్న సీఎం వైయస్ జగన్.

బిసికులాల్లో చిన్నకులాలను కూాడా అభివృధ్ది చేస్తాం.

ముదళియార్ కులస్దుల నుంచి బలమైన నాయకత్వం ఎదగాలి.

తాడేప‌ల్లి: డబ్బు, వారసత్వ రాజకీయాలకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చోటులేద‌ని పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎమ్మెల్సీలు లేళ్ళ‌ అప్పిరెడ్డి, జంగా కృష్ణమూర్తి పేర్కొన్నారు. బిసి కులాలను సమాజంలో శక్తివంతం చేయడమే ధ్యేయంగా ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ పనిచేస్తున్నారని  తెలిపారు.  తాడేపల్లి లో వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ముద‌ళియార్‌ కమ్యూనిటీ రాష్ట్ర స్థాయి సమావేశం శనివారం జరిగింది. సమావేశానికి ముద‌ళియార్ కార్పొరేష‌న్ ఛైర్మ‌న్  టి.జి. సురేష్ (బుల్లెట్‌) అధ్యక్షత వహించారు.

సమావేశంలో  లేళ్ళఅప్పిరెడ్డి మాట్లాడుతూ.. దివంగత శ్రీ వైయస్ రాజశేఖరరెడ్డి మరణం తర్వాత శ్రీ వైయస్ జగన్ ఒక్కడుగా పోరాటం చేసి ఆ తర్వాత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని స్దాపించడమే కాకుండా తన పాదయాత్రల ద్వారా ప్రజల సమస్యలు తెలుసుకున్నారన్నారు. ముఖ్యంగా బిసిల సమస్యలను స్వయంగా వారి కుటుంబాలను కలవడం ద్వారా తెలుసుకున్నారన్నారు. ఆ తర్వాత బిసి లకు చెందిన శ్రీ జంగా కృష్ణమూర్తి అధ్యక్షతన బిసి అధ్యయన కమిటిని నియమించి వారి సమస్యలను పూర్తి స్దాయిలో అద్యయనం చేశారన్నారు. బిసి డిక్లరేషన్ ప్రకటించి తద్వారా అధికారంలోకి వచ్చిన అనంతరం 56 బిసి కార్పోరేషన్లను ఏర్పాటుచేయడం జరిగిందన్నారు. గత రెండు నెలల కాలంలో ఈ బిసి కార్పోరేషన్ల సమావేశాలను ఏర్పాటుచేసి వారి సమస్యలు తెలుకునే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఆ సమస్యలను తెలుసుకునేందుకు బిసి సంక్షేమ శాఖమంత్రి శ్రీ వేణుగోపాలకృష్ణగారు కూడా ఈ సమావేశాలలో పాల్గొంటున్నారన్నారు. బిసి కులాల నేతలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలుగా గుర్తింపు పొందాలన్నారు. ముదళియార్ కమ్యూనిటి నుంచి బలమైన నాయకత్వం ఎదగాలన్నారు. పదవులు మీ ఇంటికి వచ్చే రీతిలో పనిచేయాలని కోరారు. డబ్బులు, పలుకుబడి, వారసత్వ రాజకీయాలు అనేవి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చోటులేదన్నారు. నందిగమ్ సురేష్, గురుమూర్తిలకు ఏమాత్రం డబ్బు లేకపోయినా కూడా పార్టీ తరపున అభ్యర్దిత్వం నిర్ణయించి వారిని ఎంపిలుగా గెలిపించిన ఘనత శ్రీ వైయస్ జగన్ దని అన్నారు. ఈ విషయాన్ని పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలందరూ గమనించాలన్నారు. మీ సమస్యల గురించి ఆయా జిల్లాలలో ఉన్న శాసనసభ్యులతో చర్చించి పరిష్కరిస్తామని వివరించారు.

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బిసి సెల్ అద్యక్షుడు, ఎమ్మెల్సీ  జంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ.. మద్రాసు ఉమ్మడి రాష్ట్రంలో  నెల్లూరు, చిత్తూరు ప్రాంతాలలో ముదళియార్లు అత్యధికంగా స్ధిరనివాసం ఏర్పాటు చేసుకున్నారన్నారు. ఆ తర్వాత కడప, అనంతపురం జిల్లాల్లోనే కాకుండా ఇతర జిల్లాల్లో కూడా నివాసం ఉంటున్నారన్నారు. మూడు కులాలకు సంబంధించిన వారిని ముదళియార్ లు గా గుర్తించడం జరిగింది. ఇందుకోసం జిఓ కూడా జారీచేశారన్నారు. దివంగత నేత శ్రీ వైయస్ రాజశేఖరరెడ్డి ఏ విధంగా అయితే బిసివర్గాలను ప్రోత్సహించారో అదే రీతిలో శ్రీ వైయస్ జగన్ కూడా వారిని రాజకీయంగా, సామాజకంగా ప్రోత్సహిస్తున్నారన్నారు. దానిలో భాగంగానే ముదళియార్లకు ఒక కార్పోరేషన్ ఏర్పాటుచేశారన్నారు. 139 కులాలకోసం 56 కార్పోరేషన్లను ఏర్పాటుచేశారన్నారు. ఇవే గాక సాధారణ కార్పోరేషన్ల పదవులలో సైతం బిసిలను అత్యధికంగా నియమించారన్నారు. బిసిలలో పేదరికాన్ని పొగొట్టేందుకు అనేక పథ‌కాలు అమలు చేస్తున్నారన్నారు. శ్రీ వైయస్ జగన్ ఇస్తున్న అవకాశాలను వినియోగించుకుని బిసి లందరూ మరింత ఉన్నత స్ధానాలకు ఎదగాలని కోరారు. ముదళియార్ల సమస్యలను బిసి కమిషన్ దృష్టికి తీసుకువెళ్తానన్నారు. వారికి సంబంధించి కులధృవీకరణ పత్రాల జారీలో ఎదురవుతున్న సమస్యను కూడా పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు.

సమావేశంలో నవరత్నాలు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌-చైర్మన్  అంకంరెడ్డి నారాయ‌ణ‌ మూర్తి, ముద‌ళియార్ కార్పొరేష‌న్ డైరెక్ట‌ర్లు , ముదళియార్ కులసంఘ రాష్ట్ర నేతలు, త‌దిత‌రులు పాల్గొన్నారు

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top