అమరావతి: తిరుమల లడ్డూ ప్రసాదం అంశంపై చర్చకు ప్రభుత్వం భయపడుతోందని ఎమ్మెల్సీవైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి విమర్శించారు. చర్చకు వస్తామని చెప్పి చివరకు వాయిదా వేయించారని ఆరోపించారు. టీడీపీ పాలనలో జరుగుతున్న అక్రమాలు బయటపడతాయనే భయంతోనే ప్రభుత్వం సభా చర్చను తప్పించుకుంటోందని అన్నారు. టీడీపీలోని అవినీతి వ్యవహారాలు బయటపడతాయన్న భయంతోనే వెనక్కి తగ్గారని వ్యాఖ్యానించారు. హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్, ఇందాపూర్ డెయిరీ, వైష్ణవి డెయిరీ మధ్య ఉన్న సంబంధాలు వెలుగులోకి వస్తాయనే ఆందోళనతోనే చర్చను అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వార్థ ప్రయోజనాల కోసం తిరుమల లడ్డూ ప్రసాదంపై కొందరు అనవసర వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. ఈ అంశంపై చర్చ జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. అలాగే రాష్ట్ర బడ్జెట్‌పై కూడా సభలో విస్తృతంగా చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి మాట్లాడుతూ, నిజాలు బయటకు వస్తాయన్న భయంతోనే లడ్డూ అంశంపై చర్చను వాయిదా వేశారని ఆరోపించారు. ఇందాపూర్ డెయిరీ–హెరిటేజ్ సంస్థల మధ్య ఉన్న సంబంధాలు బయటపడతాయనే భయంతో ప్రభుత్వం వెనక్కి తగ్గిందని విమర్శించారు. రాయలసీమ ఎత్తిపోతల పథకంను కూటమి ప్రభుత్వం నిలిపివేసిందని ఆయన ఆరోపించారు. అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కూటమి ప్రభుత్వం కచ్చితంగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.