ఇళ్ల నిర్మాణ పథకం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థనే మారుస్తుంది

పేదల సొంతింటి కల నెరవేరడంతో పాటు అనేక మందికి ఉపాధి

సీఎం వైయస్‌ జగన్‌ చరిత్రలో నిలిచిపోతారు 

అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే ఎందుకంత కంటగింపు

సంపన్నులు ఉండే ప్రాంతాల్లో పేదలు ఉండకూడదా..?

పేదలపై టీడీపీకి చిత్తశుద్ధి ఉంటే.. కోర్టు పిటీషన్లు ఉపసంహరించుకోవాలి

వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్‌ విజ్ఞప్తి

తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ఇళ్ల నిర్మాణ పథకం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మారుస్తుందని వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవర ప్రసాద్‌ అన్నారు. పేదలకు సొంతింటి కల నెరవేర్చడంతో పాటు అనేక వృత్తుల వారికి ఉపాధి కల్పిస్తున్నారని, ఇళ్ల నిర్మాణం వల్ల 21.70 కోట్ల పనిదినాలు లభిస్తాయన్నారు. భారత దేశ చరిత్రలో ఇంత పెద్ద మొత్తంలో ఇళ్ల పట్టాలు ఇచ్చిన దాఖలాలు లేవని, సీఎం వైయస్‌ జగన్‌ చరిత్రలో నిలిచిపోతారన్నారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్‌ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 

ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విప్లవాత్మక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని, దయచేసి జరిగే మంచిని అందరూ ప్రోత్సహించాలని ప్రతిపక్షాలను కోరారు. ఇంకా ఎక్కువ మందికి ఇళ్లు వచ్చేలా చేయాలి కానీ, కార్యక్రమాన్ని నీరుగార్చే మాటలు మాట్లాడొద్దని, పేదల నోట్లో మట్టికొట్టొద్దని విజ్ఞప్తి చేశారు. 

అర్బన్‌లో సెంటు స్థలం, రూరల్‌లో సెంటున్నర స్థలం ఇస్తే ఎందుకు కంటగింపు అని ప్రతిపక్షాలను ప్రశ్నించారు. మీరు ఒక సెంట్‌ స్థలం ఇచ్చారా..? పేదల కోసం ఇలాంటి కార్యక్రమం చేయాలని ఎప్పుడైనా కనీసం ఆలోచన అయినా చేశారా..? అని ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్‌ ప్రశ్నించారు. 

అమరావతిలో 54 వేల పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి.. ఇళ్లు కట్టిస్తే.. డెమోగ్రఫిక్‌  ఇన్‌బ్యాలెన్స్‌ వస్తుందని కోర్టుకు వెళ్లి వాదించలేదా..? అని చంద్రబాబును ప్రశ్నించారు. సామాజిక సమతూల్యం దెబ్బతింటుందని టీడీపీ కోర్టుకెళ్లి 54 వేల ఇళ్ల పట్టాలు పేదలకు ఇవ్వకుండా అడ్డుకుందన్నారు. డబ్బున్న వారుండే ప్రదేశంలో పేదలు ఉండకూడదా..? ఇది ప్రజాస్వామ్యం కాదా..? రాచరిక వ్యవస్థలో ఉన్నామా..? అని మండిపడ్డారు. 

నిజంగా పేదల పట్ల చిత్తశుద్ధి, మంచి జరగాలనే ఆలోచన ఉంటే రాజధానిలో ఇళ్ల పట్టాలపై వేసి పిటీషన్లు ఉపసంహరించుకోవాలని సూచించారు. 54 వేల ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు మార్గం సుగుమం చేయండి అని విజ్ఞప్తి చేశారు.  

తన తండ్రి దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి స్ఫూర్తిని సీఎం వైయస్‌ జగన్‌ పుణికిపుచ్చుకున్నారని ఎమ్మెల్సీ డొక్కా అన్నారు. వైయస్‌ఆర్‌ ఆనాడు పేదలకు ఇళ్లు కట్టించారని గుర్తుచేశారు. తన తండ్రి స్ఫూర్తితో అంతకు మించిన కార్యక్రమాన్ని సీఎం వైయస్‌ జగన్‌ చేపట్టారన్నారు. 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమం దేశంలోనే జరగలేదని, సీఎం వైయస్‌ జగన్‌ చరిత్రలో నిలిచిపోతారన్నారు. 

ఎవరూ ఆందోళనలు చేయాల్సిన అవసరం లేకుండా.. రోడ్డెక్కాల్సిన దుస్థితి రాకుండా.. ప్రభుత్వమే ఇళ్లు ఇస్తామని ముందుకు వస్తుందన్నారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే.. ఇంత మంచి కార్యక్రమాన్ని అందరూ బహిరంగంగా సపోర్టు చేయాలని ప్రతిపక్షాలను కోరారు. ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలపాలని కోరారు.  

 

తాజా వీడియోలు

Back to Top