నేడు వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన

తాడేపల్లి: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాను నేడు విడుదల చేయనున్నారు. స్థానిక సంస్థల కోటాకు సంబంధించి 9, ఎమ్మెల్యే కోటాకు సంబంధించి 7.. మొత్తం 16 ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేడు ప్రకటించనుంది. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో మరోసారి సామాజిక న్యాయానికి పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ పెద్దపీట వేసినట్టుగా తెలుస్తోంది.16 మంది వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల్లోనూ బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలనే ప్రామాణికంగా జాబితాను సిద్ధం చేసినట్టుగా తెలుస్తోంది.  
 

Back to Top