వాడికి ఎందుకంత కొవ్వు..!

ఫీల్డ్ అసిస్టెంట్‌పై నోరు పారేసుకున్న టీడీపీ ఎమ్మెల్యే బెందాళం అశోక్‌

దురుసుగా మాట్లాడిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌

శ్రీకాకుళం:  జాతీయ గ్రామీణ‌ ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్‌పై ఇచ్చాపురం టీడీపీ ఎమ్మెల్యే బెందాళం అశోక్ నోరు పారేసుకున్నారు. ఫీల్డ్ అసిస్టెంట్ ను ఉద్దేశిస్తూ వాడికి ఎందుకంత కొవ్వు... వాడు అంత డార్కాడిగాడా?. నా దగ్గరికి వాడు ఎందుకు రాలేదు అంటూ ఎమ్మెల్యే దురుసుగా మాట్లాడారు. గత కొన్ని రోజులుగా ఇచ్చాపురం మండలం కొఠారి గ్రామానికి చెందిన ఫీల్డ్ అసిస్టెంట్ లక్కోజీ రవి కుమార్‌పై ఎమ్మెల్యే కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. టీడీపీ నేత‌లు ఫీల్డ్ అసిస్టెంట్ రవి కుమార్ తొలగిస్తున్నారని తెలియడంతో గ్రామ‌స్తులు  ఎమ్మెల్యే వద్దకు వెళ్లి రిక్వెస్ట్ చేశారు. రవికుమార్ ఏ తప్పు చేయలేదని అతనిని తొలగించొద్దని ఎమ్మెల్యేను  గ్రామస్తులు వేడుకున్నారు. ఈ క్ర‌మంలో కోపోద్రిక్తుడైన ఎమ్మెల్యే..ఏం చేయాలో నాకు తెలుసు మీరు చెప్పాల్సిన అవసరం  లేదు అంటూ గ్రామస్తులు, మహిళలతో దురుసుగా మాట్లాడారు. ఎమ్మెల్యే ఏమ‌న్నారంటే.. `ఫీల్డ్ అసిస్టెంట్ సంగ‌తి నాకు చెబుతారా?  ఫీల్డ్‌లో ఏం జ‌రుగుతుందో నాకు తెలియ‌దా?  వాడి కోసం మీరెందుకు రోడ్డెక్కుతారు. ఎవ‌రో ఒక వ్య‌క్తి త‌ప్పు చేశాడ‌ని మీరెందుకు స‌ఫ‌ర్ కావాలి?  మిమ్మ‌ల్ని ఇబ్బంది పెట్టే ఏ ప‌ని జ‌ర‌గ‌దు. అంత‌వ‌ర‌కు నేను గ్యారంటీ. మిగిలిన ఇష్యూస్ గురించి మీరు ఎంట‌ర్ కావొద్దు. అఫిషీయ‌ల్‌గా జ‌రుగుతున్న ప‌నులు ఇవి. ఒక ఫీల్డ్ అసిస్టెంట్ ఏ ప‌రిధిలో ఉండాలో ఆ ప‌రిధిలో ఉండాలి. ఈ రోజు వాడు ఇంత మంది ఆడ‌వాళ్ల‌ను ఇక్క‌డికి పంపించాడంటే వాడి రాజ‌కీయం ఏందో అర్థం చేసుకోండి. వాడికి అంత కొవ్వూ..అలాంట‌ప్పుడు వాడు రావాలి. వాడు వ‌చ్చి ఏం జ‌రిగింద‌ని న‌న్ను అడ‌గాలి. వాడు రాకుండా మీతో డ్రామాలాడిస్తాడా?  వాడికెందుకు అంత కొవ్వు..వాడేం అంత డార్కాడిగాడా? . వాడు బాగా ప‌ని చేసి ఉంటే 28 కంప్లెంట్స్ ఎందుకు వ‌చ్చాయి. అధికారికంగా రాసి రిజిస్ట్ర‌ర్డ్ చేసి విచార‌ణ చేసిన కంప్లెంట్స్ ఇవి. వాడంటే మీకు ఇష్టం ఉండ‌వ‌చ్చు. కానీ రాష్ట్ర ప్ర‌భుత్వానికి కూడా కొన్ని నిబంధ‌న‌లు ఉంటాయి క‌దా? ఈ స‌బ్జెక్ట్ వ‌దిలేయండి. వాడిని పిలిపించి నేను మాట్లాడుతా` అంటూ ఎమ్మెల్యే త‌న వ‌ద్ద‌కు వ‌చ్చిన గ్రామ‌స్తుల‌ను బెదిరించి పంపించాడు. ఈ వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్‌మీడియాలో వైర‌ల్‌గా మారింది.

Back to Top