సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసిన ఎమ్మెల్సీ అభ్య‌ర్థి మంగ‌మ్మ‌

తాడేప‌ల్లి: వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు, ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిని పార్టీ ఎమ్మెల్సీ అభ్య‌ర్థి మంగ‌మ్మ తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. అనంత‌పురం జిల్లా పెనుకొండ‌కు చెందిన ఎస్‌.మంగ‌మ్మను ఎమ్మెల్సీ అభ్య‌ర్థిగా వైయ‌స్ఆర్ సీపీ ప్ర‌క‌టించింది. త‌న‌పై న‌మ్మ‌కంతో ఎమ్మెల్సీ అభ్య‌ర్థిగా ఎంపిక చేసినందుకు పార్టీ అధినేత‌, సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో మహిళా, శిశుసంక్షేమ శాఖ మంత్రి కే.వి.ఉషా శ్రీ చరణ్, హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్, పెనుకొండ ఎమ్మెల్యే ఎం.శంకర నారాయణ పాల్గొన్నారు.

Back to Top