ఆస్ప‌త్రి నుంచి స్వ‌గ్రామానికి త‌ర‌లించేందుకే..

కారులో మృత‌దేహంపై ఎమ్మెల్సీ ఉద‌య భాస్క‌ర్ వివ‌ర‌ణ‌

తూర్పుగోదావరి: కారులో డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం మృతదేహం లభ్యమైన ఘటనపై వైయ‌స్ఆర్ సీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్క‌ర్ వివరణ ఇచ్చారు. సుబ్రహ్మణ్యం తన దగ్గర ఐదేళ్లుగా డ్రైవర్‌గా పనిచేస్తున్నాడని, అయితే.. రెండు నెలల నుంచి సరిగా పనిలోకి రావడం లేదని చెప్పారు. మద్యం అలవాటు ఉండటంతో ద్విచక్రవాహనంపై సుబ్ర‌హ్మ‌ణ్యం అనేకసార్లు ప్రమాదానికి గురైనట్లు ఎమ్మెల్సీ తెలిపారు. గత రాత్రి కూడా సుబ్రహ్మణ్యం యాక్సిడెంట్‌కు గురైనట్టు తెలియడంతో అతని తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చానని,  చికిత్స కోసం కాకినాడ అమృత ఆస్ప‌త్రికి తీసుకెళ్లామని, అతని తల్లిదండ్రులు కూడా ఆస్ప‌త్రికి వచ్చారని ఎమ్మెల్సీ స్పష్టంచేశారు. సుబ్రమణ్యం మృతిచెందడంతో మృతదేహాన్ని వారి స్వగ్రామానికి తీసుకువెళతామని చెప్పడంతో కారులో అపార్ట్‌మెంట్‌ వద్దకు పంపించినట్టు వెల్లడించారు.

Back to Top