గవర్నర్‌ వద్దకు ఏ మొహం పెట్టుకుని వెళ్తున్నారు బాబూ..?

చంద్రబాబుకు వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేల ప్రశ్నలు 
 

అమరావతి: గవర్నర్‌ దగ్గరకు చంద్రబాబు ఏ ముఖం పెట్టుకొని వెళ్తున్నారని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రశ్నించారు. చంద్రబాబు శవ రాజకీయాలపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు చంద్రబాబుకు వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు ప్రశ్నలు సంధించారు.

 • గత మూడు నెలలుగా బాబు కోడెలను దగ్గరకు రానిచ్చారా?
 • కోడెల ఆత్మహత్యకు ప్రయత్నించారన్న వార్తలు విని ఆయన్ను పరామర్శించడానికి చంద్రబాబు వెళ్లారా?
 • అసెంబ్లీ నుంచి కోడెల కోట్ల రూపాయాల ఫర్నిచర్‌ను తరలించడం బాబుకు తెలిసి జరిగిందా? తెలియకుండా జరిగిందా?
 • కోడెల ఫర్నిచర్‌ వ్యవహారంలో ఆయన అరాచకాలకు గురై తట్టుకోలేక  పెద్ద ఎత్తున ప్రజలు ఫిర్యాదులు చేస్తే ఎందుకు బాబు నోరెత్తలేదు?
 • ఐదేళ్లుగా కోడెల కొడుకు, కూతురు కే-ట్యాక్స్‌ వసూలు చేశారా? లేదా?
 • ఐదేళ్లుగా కోడెలకు చెందిన ఫార్మా డీల్స్‌ బాబుకు తెలిసే జరిగాయా? తెలియకుండా జరిగాయా?
 • ఐదేళ్లుగా కోడెల అవినీతి సామ్రాజ్యానికి బాబు వెన్నుదన్నుగా ఉన్నారా? లేదా?
 • ఇటు సత్తెనపల్లిలోనూ, అటు నరసరావుపేటలోనూ భూ కబ్జాలపై చంద్రబాబు ఎందుకు విచారణ చేయించలేదు?
 • కోడెల చనిపోతూ తన మరణానికి కారణాలివి అని ఎక్కడైనా పేర్కొన్నారా?
 • ఒక మనిషి తీవ్ర  అవమానానికి గురైతే ఎన్టీఆర్‌ మాదిరిగా తల్లడిల్లిపోతారా? లేదా? 
 • ఈ విషయంపై బాబుకు పాతికేళ్ల క్రితమే తెలుసు కదా?
 • వేధింపులు అంటే ఎలా ఉంటాయో? వెన్నుపోటు అంటే ఎలా ఉంటుందో చంద్రబాబే ప్రపంచానికి చెప్పారు కదా? 
 • ఎన్టీఆర్‌ పార్టీని, పార్టీ అధ్యక్ష పదవిని, పార్టీ జెండాను, పార్టీ ఎన్నికల గుర్తును, పార్టీ ట్రస్టును , సీఎం పదవిని, ఎమ్మెల్యేలను, ఎంపీలను మీరు లాక్కొని  ఎన్టీఆర్‌ మరణానికి కారకులయ్యారని ఎన్టీఆర్‌ సతీమణి లక్ష్మీపార్వతి ఇవాల్టికీ సాక్ష్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు.
 • సాక్షాత్తూ ఎన్టీఆర్‌ కూడా మీ గురించి ఇదే విషయాన్ని చెప్పారు.
 • ఏనాడూ మీరు ఈ విషయం గురించి ఎందుకు మాట్లాడటం లేదు?
 • కోడెలది హత్యా? ఆత్మహత్యా? కుటుంబ సభ్యుల పాత్ర ఏమిటి? 
 • చంద్రబాబు పాత్ర ఏమిటి? అనే అంశాలపై సీబీఐ విచారణ జరిపించమంటారా?
 • కోడెల అధికారాన్ని అడ్డుపెట్టుకొని సత్తెనపల్లి, నర్సరావుపేటలో చేసిన అరాచకాలపై సీబీఐ విచారణ జరపమంటారా?
 • సీబీఐని ఈ రాష్ట్రంలోకే రానివ్వమంటూ చంద్రబాబు ప్రతిజ్ఞ చేశారు.జనరల్‌ పర్మిషన్‌ ఉపసంహరించుకుంటూ జీవోలు జారీ చేశారు కదా? మరి సీబీఐపై బాబుకు నమ్మకం ఎప్పుడు కుదిరింది?
 • గవర్నర్‌ వ్యవస్థనే రద్దు చేయమని చెప్పిన చంద్రబాబు ఏ మొహం పెట్టుకొని గవర్నర్‌ దగ్గరకు వెళ్తున్నారు?
 • కోడెల, అతని కుటుంబ సభ్యుల అరాచకాలు సహా ఆయన ఆత్మహత్య చేసుకోవడానికి దారితీసిన పరిస్థితులపై చంద్రబాబు సీబీఐ విచారణ కోరాలి.
 •  ఈ ప్రశ్నలన్నింటికీ చంద్రబాబు జవాబు చెప్పి..అప్పుడు గవర్నర్‌ దగ్గరకు వెళ్లమని చెబుతున్నాం.
Back to Top