సీఎం వైయస్‌ జగన్‌ చొరవతో రైతుల్లో ఆనందం

వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే శ్రీదేవి
 

కర్నూలు: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ చొరవతో టమాటా రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారని పత్తికొండ నియోజకవర్గ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే శ్రీదేవి అన్నారు. మార్కెట్‌కు ఎంత పంట వచ్చినా గిట్టుబాటు ధర కల్పిస్తామని, రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దన్నారు. కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్‌ యార్డులో  టమాటా రైతులు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. టమాటా రైతులు ఎదుర్కొంటున్న కష్టాలు తెలుసుకొని ప్రభుత్వమే కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. సీఎం వైయస్‌ జగన్, ఎమ్మెల్యే శ్రీదేవమ్మకు రుణపడి ఉంటామన్నారు.  ఈ మేరకు ఎమ్మెల్యే శ్రీదేవి మాట్లాడుతూ.. టమాటా రైతులు గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు పడుతున్నారని దృష్టికి తీసుకెళ్లిన వెంటనే ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ స్పందించి పంటను ప్రభుత్వమే కొనుగోలు చేసే విధంగా నిర్ణయం తీసుకున్నారన్నారు. సీఎం వైయస్‌ జగన్‌ చొరవతో రైతులు ఆనందంగా ఉన్నారని, గతంలో ఏ ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు.

Read Also: స్కిల్‌ డెవలప్‌మెంట్‌పై సీఎం సమీక్ష

 

Back to Top