నగరిలో చంద్రబాబు పర్యటన అట్టర్ ఫ్లాప్

బాబు అబద్దాలు వినలేక జనం పారిపోయారు

మాజీ మంత్రి ఆర్కే రోజా స్పష్టీకరణ

అయినా సిగ్గు లేగుండా ఖాళీ కుర్చీలకు అబద్దాలు

ఎప్పటిలాగే జగన్ గారెపై నిందలు

మాజీ మంత్రి ఆర్కే రోజా ఫైర్ 

నగరి క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి ఆర్కే రోజా

నగరిలో చంద్రబాబు సభ జనం లేక వెలవెల

నియోజకవర్గానికి ఇచ్చిన ఏ ఒక్క హామీ నిలబెట్టుకోని బాబు

నగరిలో ఎటు చూసినా జగనన్న అభివృద్ధి 

హామీలు గాలికొదిలేసి సూపర్ సిక్స్-సూపర్ హిట్ ప్రచారం

మాజీ మంత్రి ఆర్కే రోజా ధ్వజం

జగనన్న చేసిన భూసర్వేపైనా క్రెడిట్ చోరీ

జగన్ ను విమర్శించే హక్కు చంద్రబాబుకు లేదు

చంద్రబాబు, పవన్ పై 420 కేసులు పెట్టాలి

ప్రెస్ మీట్ లో మాజీ మంత్రి ఆర్కే రోజా డిమాండ్

నగరి:  నగరిలో చంద్రబాబు షో అట్టర్ ప్లాప్ అయిందని, ఆయన అబద్దాలు వినలేక జనాలు సగం దారిలోనే పారిపోయారని, నాయకులు పట్టుకున్నా ఆగే పరిస్ధితి లేదని మాజీ మంత్రి ఆర్కే రోజా వెల్లడించారు. గతంలో నగరికి ఇచ్చిన ఏ ఒక్క హామీ నిలబెట్టుకోలేని చంద్రబాబు సభకు రాలేక జనం దూరంగా ఉండిపోయారన్నారు. అయినా ఖాళీ కుర్చీలకు చంద్రబాబు కాన్పిడెంట్ గా అబద్దాలు చెప్పారని రోజా అన్నారు. అందుకే డైవర్షన్ రాజకీయంలో భాగంగా జగనన్నపై లేనిపోని అబద్ధాలు చెప్పారని ఆక్షేపించారు. ప్రెస్ మీట్ లో ఆర్కే రోజా ఇంకేమన్నారంటే..

నగరిలో చంద్రబాబు ఫ్లాప్ షో

రాష్ట్రాన్ని స్వచ్చాంధ్ర-స్వర్ణాంధ్ర చేస్తానని చంద్రబాబు చెప్తున్నారు. కానీ అప్పులాంధ్ర, అరాచక ఆంధ్ర, అవినీతి ఆంధ్ర, అబద్ధాల ఆంధ్రగా మార్చేశారు. ఎక్కడా కానీ స్వచ్చాంధ్ర-స్వర్ణాంధ్ర చేసే దిశగా పనిచేయలేదు. చంద్రబాబు నాలుగుసార్లు ముఖ్యమంత్రి అయినా చెప్పుకోవడానికి నగరిలో ఏ పనీ చేయలేదు. అందుకే నగరిలో మీటింగ్ కు ఎదురుగా ఉన్న ఆస్పత్రిలో పేషెంట్లను కూడా బయటికి తరిమేసి క్లీన్ చేశారు. వాస్తవానికి  100 పడకల నగరి ఆస్పత్రి రాజశేఖర్ రెడ్డి హయాంలో పునాది వేసుకుంది, వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గారి హయాంలో డయాలసిస్ సెంటర్ తో పాటు అన్ని సదుపాయాలు కల్పించారు. కాబట్టి అక్కడికి వెళ్తే అవమానం తప్పదని అటువైపు వెళ్లకుండా మీటింగ్ లోనే కూర్చున్నారు. చంద్రబాబు సభలో ఖాళీ కుర్చీలు ఉన్నా కాన్పిడెంట్ గా అబద్దాలు చెప్పారు. ఎందుకంటే జాతి మీడియా పచ్చ ఛానళ్లు ఖాళీ కుర్చీలు చూపించకుండా అబద్దాలు చూపిస్తారనే నీచమైన ఆలోచన. సీఎం ఓ నియోజకవర్గానికి వస్తే చెప్పింది చేశారని చెప్పి పూలవర్షం కురిపించాలి, కానీ మీరు ప్రశ్న అడుగుతుంటే ఒక్కరైనా సమాధానం చెప్పారా?, చేతులెత్తమంటే ఒక్కరైనా ఎత్తారా చెప్పండి. 

నగరికి టీడీపీ చేసింది శూన్యం

నగరిలో చంద్రబాబు హయాంలో ఉన్న ఎమ్మెల్యే కానీ, గతంలో ఆయన తండ్రి కానీ నియోజకవర్గానికి చేసింది శూన్యం. నగరికి కావాల్సిన అర్బన్ హెల్త్ సెంటర్లు మొన్నటివరకూ అద్దె భవనాల్లో ఉన్నాయి. జగనన్న హయాంలో డయాలసిస్ సెంటర్లు, పార్క్, ఎలక్ట్రిక్ స్మశాన వాటిక, పుత్తూరులో పాలిటెక్నిక్ కాలేజ్, షాదీ మహల్ వంటి నిర్మాణాలు చేశాం. టీటీడీ ద్వారా వడమాలపేటలో కళ్యాణమండం, నగరి రూరల్ లోని బుగ్గ అగ్రహారం దగ్గర మరొకటి మేమే కట్టాం.  నిండ్రలో టెంపుల్, సబ్ స్టేషన్లు, ఐటీ కాలేజ్ కట్టాం. రైతు భరోసా కేంద్రాలు, సచివాలయాలు, పేదలకు ఇళ్లు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. కానీ నాలుగుసార్లు సీఎం అయిన చంద్రబాబు ఇదే జిల్లాలో పుట్టి నగరికి చేసిందేమీ లేదు. చంద్రబాబు ప్రతీ ఎన్నికలకు ముందు ప్రచారానికి వచ్చి టెక్స్ టైల్ పార్క్ కట్టిస్తామని చెప్తారు. కానీ ఎన్నికలు అయ్యాక పంగనామాలు పెడ్తూనే ఉన్నారు. నగరిలో చేనేత కార్మికులకు పిల్లల చదువుల కోసం, వారి ఆరోగ్యం, పక్కా ఇళ్ల కోసం జగనన్న లక్షల రూపాయలు ఖర్చుపెట్టారు. కోవిడ్ లో సైతం చేనేత కార్మికులకు పిల్లల యూనిఫామ్స్ ద్వారా డబ్బులు వచ్చేలా ఆర్డర్లు ఇచ్చారు. నేతన్న నేస్తం ఇచ్చారు. కానీ ముద్దు కృష్ణమనాయుడు, ఆయన కొడుకు భానుప్రకాష్ నియోజకవర్గాన్ని పూర్తిగా నాశనం చేశారు. చిత్తూరు జిల్లాలో పుట్టిన చంద్రబాబు జిల్లాకు చేసిందేమీ లేదు, నగరికీ చేసిందేమీ లేదు. చంద్రబాబు షుగర్ ఫ్యాక్టరీల్ని తన బినామీలకు కట్టబెట్టి రైతుల్ని ముంచారు. 

సూపర్ సిక్స్-సూపర్ ప్లాప్

ప్రతీ మీటింగ్ లోనూ సూపర్ సిక్స్-సూపర్ హిట్ అని చంద్రబాబు చెప్పుకుంటున్నారు. ప్రతీ నిరుద్యోగికీ ఉద్యోగం ఇస్తాం లేదా 3 వేల నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఇప్పటి వరకూ ప్రతీ నిరుద్యోగికీ 3 వేల చొప్పున 57 వేల బాకీపెట్టి సూపర్ హిట్ అని ఎలా చెప్పుకుంటారు. 18 ఏళ్ల పైన మహిళలకు నెలకు 1500 ఇస్తామన్నారు. దీని ప్రకారం ప్రతీ ఒక్కరికీ రూ.28,500 ఎగనామం పెట్టారు. ఎంత మంది ఉంటే అంత మందికీ తల్లికి వందనం ఇస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన 80 లక్షల మందిలో 30 లక్షల మందికి కోత పెట్టారు. 20 వేలు రైతు భరోసాగా ఇస్తామని చెప్పి, రెండేళ్లలో 40 వేలకు బదు 10వేలు ఇచ్చి మిగతాది పంగనామం పెడుతున్నారు. ఆడబిడ్డ నిధి మొదటి ఏడాది పూర్తిగా పంగనామం పెట్టారు. గ్యాస్ సిలెండర్లు 51 లక్షల మంది మహిళలకు ఇస్తామని పంగనామం పెట్టారు. 16 రకాల ఆర్టీసీ బస్సుల్లో 11 రకాల బస్సుల్లో స్త్రీశక్తి పథకం ఇస్తామని చెప్పి పంగనామం పెట్టారు. అయినా సిగ్గులేకుండా సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని ఎలా చెప్పుకుంటారు.

క్రెడిట్ చోరీ చేసి సిగ్గులేకుండా  విమర్శలు

నగరిలో మాట్లాడిన మాటలు చూస్తే రక్తం మరిగిపోతోంది. భూముల రీసర్వేను భూతద్దంలో చూపించి జగన్మోహన రెడ్డి కాజేస్తారని విష ప్రచారం చేసిన చంద్రబాబు.. ఇప్పుడు దాన్నే తమ గొప్పతనంగా చెప్పుకుంటున్నారు. గతంలో జగన్ పై చిమ్మిన విషాన్నే ఇవాళ మళ్లీ నగరిలో చిమ్మారు. జగనన్న చేసిన రీసర్వే వల్ల మీ ప్రభుత్వానికి 400 కోట్ల రాయితీ వచ్చింది నిజం కాదా ?, జగనన్న తెచ్చిన టెక్నాలజీతోనే మీరు రీసర్వే చేస్తున్నారుగా, జగనన్న తెచ్చిన పాస్ బుక్ ల అట్టలు మార్చి కాపీ క్యాట్ లా ఇస్తున్నది నిజం కాదా? జగనన్న తెచ్చిన డ్రోన్లు, హెలికాఫ్టర్లను తొలగించే ధైర్యం ఉందా అని చంద్రబాబును అడుగుతున్నాం. మా ప్రభుత్వంలో చేసిన మ్యాప్ లను నిలిపేసే ధైర్యం ఉందా?, జగన్ చేసింది తప్పు అయితే దాన్ని ఎందుకు కొనసాగిస్తున్నారు, ఎందుకు ఆపేయడం లేదు? మేం పాస్ బుక్ ల మీద ఫొటో వేస్తే తప్పని చెప్పి ఇప్పుడు మీ ఫొటోలు ఎందుకు వేసుకుంటున్నారు ? ఇందులో మీ పాత్ర అస్సలు లేనప్పుడు ఫొటో వేసుకోవడానికి సిగ్గు లేదా?, మరుగుదొడ్లు, అప్పడాలు, మిషన్ల మీద కూడా ఫొటోలు వేసుకున్న చరిత్ర మీది. జగనన్న గొప్పతనం మీరు మెచ్చుకోకపోయినా మీరు వెళ్లిన దావోస్ లో ఆర్థికవేత్త గీత గోపీనాథ్ ప్రశంసించారు.  జగనన్న మొదలుపెట్టిన ప్రాజెక్టుల్ని రేవంత్ రెడ్డి మాట విని ఆపేసిన చరిత్ర నీది. రేవంత్ కు భయపడి రాయలసీమ ప్రాజెక్టుల్ని తాకట్టుపెట్టారు. సాగునీటి రంగం గురించి ఏరోజూ ఆలోచన చేయని చంద్రబాబు.. జగనన్నపై విమర్శలు చేయడమేంటి ? 

చంద్రబాబు, పవన్ పై 420 కేసులు పెట్టాలి

స్కిల్ స్కాంలో వందల కోట్లు కొల్లగొట్టి, అరెస్టు అయి జగన్ మీద అబద్ధాలు చెప్తున్నారు. మేం అక్రమ కేసులు పెట్టలేదు. మీరే మీపై నమోదైన కేసులను అక్రమంగా కొట్టేసుకుంటున్నారు. నిప్పు అని చెప్పుకునే చంద్రబాబు.. కోర్టులో నిర్దోషిగా నిరూపించుకోకుండా మీ కింద ఉన్న సీఐడీ మీద ఒత్తిడి తెచ్చి, కోర్టులో తప్పుడు నివేదికలు ఇచ్చి కేసులు ఎందుకు కొట్టేసుకుంటున్నారు. అడ్డదారిలో కేసులు ఎందుకు కొట్టేసుకుంటున్నారో చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు చెప్పాలి. రాష్ట్రంలో ప్రస్తుతం శాడిస్టు, అరాచక పాలన జరుగుతోంది. నవ్వితే కేసు, కోడి కోస్తే కేసు పెడుతున్నారు. మీకు జగనన్న పాలనను విమర్శించే హక్కు లేదు. ప్రజల పన్నుల డబ్బు అన్యాయంగా ఖర్చుపెట్టే వరస్ట్ పొలిటిషియన్స్ చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్. రాష్ట్రంలో అక్రమాలపై పవన్ మాట్లాడరు, అదృశ్యమయ్యారని చెప్పిన 30 వేల అమ్మాయిల్ని తీసుకురారు, ఆడపిల్లలపై రేప్ లు జరిగితే మాట్లాడరు, రైతులకు అన్యాయం చేసినా, విద్యార్దులపై రౌడీ షీట్లు పెట్టినా మాట్లాడరు. మరి దేనికి మీకు ఓటేసింది, దేనికి మిమ్మల్ని డిప్యూటీ సీఎం చేసింది. ప్రజల్ని మోసం చేసినందుకు చంద్రబాబు, లోకేష్ పై 420 కేసులు పెట్టాలి. నేషనల్ మీడియా కూడా షాకయ్యేలా 23 లక్షల కోట్ల ఉద్యోగాలు ఇచ్చామని చంద్రబాబు అబద్ధాలు చెప్తున్నారు. నేపాల్ తరహాలో ఇక్కడ కూడా ప్రజలు వీళ్లను తరిమికొట్టాలని  ఆర్కే రోజా పిలుపునిచ్చారు.

Back to Top