ప్రజలకు మోసం చేయడమే చంద్రబాబు ఎజెండా

స్థానిక సంస్థ ఎన్నికలకు సిద్ధం కావాలి

ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వర రాజు పిలుపు

అల్లూరి జిల్లా: ప్రజలకు మోసం చేయడమే చంద్రబాబు నాయుడు ఎజెండాగా మారిందని, పేరుకే హామీలు ఇచ్చి పెత్తనం మాత్రం కూటమి నాయకుల చేతుల్లో ఉందని వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ అల్లూరి జిల్లా అధ్యక్షులు, శాసన సభ్యులు మత్స్యరాస విశ్వేశ్వర రాజు గారు తీవ్ర విమర్శలు చేశారు. ప్రతి గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాల్సిందేనని ఆయన పిలుపునిచ్చారు. వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహ‌న్‌ రెడ్డి గారి ఆదేశాల మేరకు, చింతపల్లి మండలం జిల్లా పరిషత్ గెస్ట్ హౌస్‌లో మండల నాయకుల అధ్యక్షతన నిర్వహించిన మండల సంస్థాగత నిర్మాణ కమిటీల విస్తృత స్థాయి సమావేశంలో మత్స్యరాస విశ్వేశ్వర రాజు గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ…పంచాయ‌తీ గ్రామ కమిటీలను త్వరితగతిన పూర్తి చేసి, కార్యకర్తలు సైనికుల్లా పనిచేస్తూ కూటమి ప్రభుత్వం చేస్తున్న వైఫల్యాలను ప్రతి గ్రామానికి తీసుకువెళ్లాలని దిశానిర్దేశం చేశారు. పార్టీ కోసం నిజాయితీగా పనిచేసిన ప్రతి కార్యకర్తకు సముచిత స్థానం కల్పిస్తుందని స్పష్టం చేశారు. ఏ గ్రామానికి వెళ్లినా వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీకి ప్రజల నుంచి అపార ఆదరణ లభిస్తోందని పేర్కొన్న ఆయన, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు అందరూ కట్టుబడి పనిచేయాలని, పార్టీ సిద్ధాంతాలను తూచతప్పకుండా పాటించాలని సూచించారు. పార్టీ బలోపేతమే శిరోధార్యంగా తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు పాంగి గణబాబు, ఎంపీపీ కోరభు అనూష దేవి, జడ్పీటీసీ పోతురాజు బాలయ్య, ఎస్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జల్లి సుధాకర్, జిల్లా మహిళా అధ్యక్షురాలు కురూస పార్వతమ్మ, మాజీ ఏఎంసీ చైర్మన్ జల్లి ఆలియా రాణి, రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి బుసారి కృష్ణారావు, స్థానిక సర్పంచ్ దురియ పుష్పలత, జిల్లా అధికార ప్రతినిధి సురేష్ కుమార్, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు మోరీ రవి, వివిధ పంచాయతీల సర్పంచులు, ఎంపీటీసీలు, రాష్ట్ర, జిల్లా అనుబంధ విభాగాల నాయకులు, మండల కమిటీ అధ్యక్షులు, కార్యదర్శులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Back to Top