విజయవాడ: ఉమ్మడి జలాశయాలను ఏకపక్షంగా వాడుకోవడం తెలంగాణ రాష్ట్రానికి తగదని వైయస్‌ఆర్ సీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్‌పర్సన్ ఆర్కే రోజా అన్నారు. విద్యుత్ ఉత్పత్తి పేరుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం చేయొద్దని కోరారు. జలవివాదం సామరస్య పరిష్కారం కావాలని ఆశిస్తున్నానని, లేని పక్షంలో కేంద్రం జోక్యం చేసుకొని ఏపీకి న్యాయం చేయాలని కోరారు.