చంద్రబాబు దిగజారుడు వ్యాఖ్యలు మానుకో..

ఫండ్‌ ఇవ్వకపోయిన సొంత సొమ్ముతో సేవ చేస్తున్నా..

నియోజకవర్గానికి ఏం  చేశావు..

వైయస్‌ఆర్‌సీపీ నగరి అభ్యర్థి ఆర్కే రోజా..

 

చిత్తూరు: చంద్రబాబు తన స్థాయికి దిగజారి మాట్లాడుతున్నారని వైయస్‌ఆర్‌సీపీ నగరి అభ్యర్థి ఆర్కే రోజా మండిపడ్డారు.ప్రభుత్వం తనకు సహకరించకపోయిన తనకు వచ్చే ఆదాయంతోనే నియోజకవర్గ ప్రజలకు సాయం చేస్తున్నానని తెలిపారు.వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నగరి నియోజకవర్గంలో ఉన్న చేనేత,చెరుకు పరిశ్రమలను అభివృద్ధి చేస్తానని తెలిపారు.తెలుగుదేశం పార్టీ రంగులు వేసుకునే ఎన్టీఆర్‌ పార్టీ అని, ఆ పార్టీతో చంద్రబాబుకు పనేంటి అని ప్రశ్నించారు. అదేవిధంగా బాలకృష్ణ  రంగులు వేసుకుని తన కూతురు వయసున్న వారితో డ్యాన్సులు వేస్తున్నారు.అలాంటివారికి ఎందుకు ఎమ్మెల్యే సీటు ఇచ్చావు అని ప్రశ్నించారు.చంద్రబాబు నోరు ఉంది కాదా అని మాట్లాడితే ప్రజలు నమ్మరన్నారు.చంద్రబాబు స్థాయిని మరిచి మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

నటన అనేది నా వృత్తి అని, నటిగా నన్ను గౌరవించి ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారని తెలిపారు.నాకు వచ్చే ఆదాయంతో నాలుగు రూపాయలకే భోజనం పేదవారికి పెడుతున్నానన్నారు.ఆర్వో ప్లాంట్‌ ద్వారా రెండు రూపాయలకే నీళ్లు ఇస్తున్నామని తెలిపారు.స్కూళ్లకు వాటర్‌ ఫ్యూర్‌ఫైర్స్,ఫ్యాన్లు పంపిణీ చేస్తున్నానని తెలిపారు. చంద్రబాబు అధికారంలో ఉండి ఏమి చేశారని ప్రశ్నించారు.కనీసం చంద్రబాబు ఇచ్చిన వాగ్ధానాలు కూడా నెరవేర్చలేదన్నారు.ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. ప్రజలను నన్ను గౌరవించి ఎమ్మెల్యేగా ఎన్నుకున్నందుకు నా సొంత సొమ్ముతో సేవా కార్యక్రమాలు చేస్తున్నానని తెలిపారు.నగరి,పూత్తురు నియోజవర్గాలకు చంద్రబాబు ఏమీ చేశారని ప్రశ్నించారు.ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్న నాకు అభివృద్ధి ఫండ్స్‌ ఇవ్వకుండా ప్రజలను మోసం చేశారన్నారు. 

Back to Top