అమరావతి: ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అవ్వాతాతలకు పెద్ద కొడుకుగా నిలిచి ప్రతి నెల 1వ తేదీనే పింఛన్ ఇచ్చి కొండంత అండగా, ధైర్యంగా నిలిచారని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా పేర్కొన్నారు. పింఛన్లపై ఆర్‌కే రోజా సభలో మాట్లాడారు. దేశంలోనే ఏ ముఖ్యమంత్రి అమలు చేయని విధంగా ఏపీలో వైయస్‌ఆర్ పెన్షన్ కానుక పథకాన్ని సీఎం వైయస్ జగన్ అమలు చేస్తున్నారని తెలిపారు. ఇంత గొప్ప మనసున్న ముఖ్యమంత్రి రాష్ట్రంలోనే కాదు..దేశంలో కూడా ఎప్పుడూ చూడలేదన్నారు. జగనన్న పాదయాత్ర చేస్తున్నప్పుడు ఆయన కాళ్లకు బొబ్బలెక్కినప్పడు కూడా విరమించుకోకుండా ప్రజల కష్టాలు తెలుసుకోవాలని ముందుకు వెళ్లారు. ప్రజలు తమ కాళ్లకు చెప్పులు లేకపోయినా రాజన్న బిడ్డ వస్తున్నాడని, మన కష్టాలు చెప్పుకుంటే ఆయన తీరుస్తాడని నమ్మకంతో పాదయాత్రలో వైయస్ జగన్‌ను కలిశారు. పాదయాత్రలో పింఛన్ సొమ్ము విడతల వారీగా పెంచుతానని ఆ రోజు వైయస్ జగన్ మాట ఇచ్చారు. ఇచ్చిన మాట మేరకు రూ.2500కు పింఛన్ పెంచారని రోజా తెలిపారు. వైయస్‌రాజశేఖరరెడ్డి రూ.200 పింఛన్ ఇచ్చే సమయంలో అవ్వాతాతలు అప్పట్లో గర్వంగా ఫీలయ్యారు. మమ్మల్ని వైయస్‌ఆర్ గుర్తించారని కొనియాడారు. అదే వైయస్ జగన్ రూ.2 వేల పింఛన్ పెంచడంతో అవ్వాతాతల ఆయుస్సు పెంచినట్లుగా అయ్యింది. ఈ రోజు కన్నబిడ్డలే పెద్దవాళ్లను భారంగా భావించి వదిలించుకోవాలని చూస్తున్నారు. ఈ రోజు అవ్వాతాతలకు ఒక పెద్ద కొడుకులాగా వైయస్ జగన్ అండగా నిలిచారని తెలిపారు. వైయస్ జగన్ ఇస్తున్న పింఛన్‌ను డబ్బుగా చూడటం లేదు. అందరూ కూడా కొండత దైర్యంగా భావిస్తున్నారు. నెల వచ్చేసరికి మందులకు డబ్బులు లేవనే బాధ లేకుండా హ్యాపీగా ఫీలవుతున్నారు. కోవిడ్ సమయంలో తమ పింఛన్ డబ్బులతోనే కొడుకుల కుటంబాలను పోషించారు. కోవిడ్ సమయంలో ఆర్థిక మాద్యం సంభవించిన వైయస్ జగన్ పింఛన్లు ఆపలేదు. 65 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు పింఛన్ అర్హతను తగ్గించింది వైయస్ జగనే. గతంలో ప్రభుత్వాలు పథకాలు పెట్టి కోతలు పెట్టారు. వైయస్ జగన్ ప్రభుత్వంలో ఎక్కువ మందికి పథకాలు అందాలని తాపత్రయపడుతున్నారు. ఎవరైనా దరఖాస్తు చేసుకుంటే వాలంటీర్ల ద్వారా పరిశీలన చేయించి 21 రోజుల్లోనే కొత్తగా పింఛన్లు ఇస్తున్నారు. గతంలో చూశాం..రూ.75 ఇవ్వడానికి అష్టకష్టాలు పడేవారు. కొత్త పింఛన్ రావాలంటే ఎవరో ఒకరు చనిపోవాలి. వైయస్ జగన్ పాదయాత్రలో రూ.2 వేలు పింఛన్‌ఇస్తామంటే..ఎన్నికలకు ముందు టీడీపీ రూ.2 వేలకు పెంచారు. వారు అధికారంలోకి వచ్చిన్నప్పుడే ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. గతంలో వికలాంగులకు రూ.1500 మాత్రమే ఇచ్చేవారు. వైయస్ జగన్ రూ.3 వేలు ఇస్తున్నారు. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు రూ.2500 గత ప్రభుత్వం ఇస్తే మా ప్రభుత్వం రూ.10 వేలు ఇవ్వడం మనం కళ్లారా చూస్తున్నాం. తలసేమియా, బోధకాలు, తీవ్ర కిడ్నీ, కాలేయం, గుండె మార్పిడి చేసిన వారికి కొత్తగా పింఛన్లు ఇస్తున్నారు. గతంలో టీడీపీ వాళ్లు ఇచ్చిన పింఛన్లు, వైయస్ జగన్ ఇచ్చిన పింఛన్లను పరిశీలిస్తే ఏ ప్రభుత్వానికి ఎక్కువ ప్రేమ ఉందో తెలుస్తుందని ఆర్కే రోజా అన్నారు . వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చాక దాదాపుగా 62 లక్షల మందికి వైయస్ జగన్ పింఛన్లు ఇస్తున్నారని గర్వంగా చెప్పారు. ఆ రోజు జన్మభూమి కమిటీల పేరుతో పింఛన్లు కావాలంటే డబ్బుల వసూలు చేశారని విమర్శించారు. పార్టీలు, కులాలు చూసి అర్హులకు పింఛన్లు రాకుండా చూశారని తెలిపారు.భర్త ఉంటే కూడా వితంతువు పింఛన్లు టీడీపీ హయాంలో పంపిణీ చేశారు. ఇవాళ వాలంటీర్లు ఇంటింటా పర్యటించి అర్హులందరికీ పింఛన్లు మంజూరు చేస్తున్నారు. మబ్బులు అడ్డగించి సూర్యుడు ఉదయించడం కాస్త ఆలస్యం అవుతుందేమో కానీ ఈ రోజు 1వ తేదీ వచ్చిందంటే చాలు తెల్లవారకముందే వాలంటీర్లు గడప వద్దకే వెళ్లి పింఛన్లు ఇస్తున్నారు. ఎవరి కాళ్లు పట్టుకోకుండా, ఎవరికి లంచం ఇవ్వకుండా పింఛన్లు అందుతున్నాయి. అలాంటి ముఖ్యమంత్రికి సెల్యూట్ చేయాలని ఆర్కే రోజా పేర్కొన్నారు. 14 ఏళ్లు అధికారంలో ఉండి చేయలేని కార్యక్రమాలు సీఎం వైయస్ జగన్ రెండేళ్లలో చేసి చూపారు. సిగ్గు లేకుండా ఇవాళ 1000 రోజుల సీఎం వైయస్ జగన్ పాలనపై చార్జ్‌షిట్ అంటూ టీడీపీ విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 14 ఏళ్లు గాడిదలు కాసి ఇవాళ సభలో అల్లరి చేస్తున్నారని టీడీపీ నేతలను ఆర్కే రోజా విమర్శించారు.