వైయ‌స్‌ వివేక హత్య కేసుపై రాజకీయం చేయడం తగదు

వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామ‌కృష్ణారెడ్డి

తిరుప‌తి: వైయ‌స్‌ వివేక హత్య కేసుపై రాజకీయం చేయడం తగదని వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామ‌కృష్ణారెడ్డి హిత‌వు ప‌లికారు. తిరుమలలో ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు.  నారా లోకేష్ వార్డు కౌన్సిలర్ గా గెలిచిన తర్వాత.. 151 అసెంబ్లీ సీట్లు గెలిచిన సీఎం వైయ‌స్‌ జగన్ పై విమర్శలు చేయాలంటూ సెటైర్లు వేశారు. చంద్రబాబు కారణంగానే రాష్ట్రానికి రాజధాని సమస్య ఏర్పడిందని విమర్శించారు.  టీటీడీ ఈవోగా ధర్మారెడ్డి భాధ్యతలు స్వీకరించినప్పటి నుండి పైరవీలకు చెక్ పడిందన్నారు. సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇచ్చేలా టిటిడి నిర్ణయాలు తీసుకుంటుందంటూ ప్రశంసలు కురిపించారు.. అటు సామాన్యలుకు.. ఇటు వీఐపీలకు ఇబ్బంది లేకుండా ధర్మారెడ్డి నిర్ణయాలు తీసుకుంటున్నారని తెలిపారు.   రాబోవు ఎన్నికల్లో ప‌ల్నాడు జిల్లాలోని 7కి ఏడు సీట్లు వైయ‌స్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గెలవబోతుందనే నమ్మకాన్ని మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వ్యక్తం చేశారు .

Back to Top