వరద పరిస్థితిపై అధికారులంతా అప్రమత్తంగా ఉన్నారు

ఎమ్మెల్యే పార్థసారధి
 

విజయవాడ: ప్రకాశం బ్యారేజికి అధికంగా వరద నీరు వస్తుండటంతో అధికారులంతా అప్రమత్తంగా ఉన్నారని ఎమ్మెల్యే పార్థసారధి తెలిపారు. ముంపు బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. ముంపు బాధిత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నామని చెప్పారు. ఈ విషయాన్ని పక్కదోవ పట్టించేందుకు టీడీపీ డ్రామాలాడుతుందని మండిపడ్డారు. ఇకనైనా టీడీపీ నేతలు డ్రామాలు కట్టిపెట్టాలని సూచించారు. సీఎం వైయస్‌ జగన్‌ కూడా వరద పరిస్థితిని ఎప్పుటికప్పుడు సమీక్షిస్తున్నారని చెప్పారు. వరద వచ్చే స్థలంలో చంద్రబాబు నివాసం ఉంటున్నారని, ఆయన ఉంటున్నది అక్రమ కట్టడమని అప్పుడే  చెప్పామని తెలిపారు. వరద ఎక్కువైతే ఆ ఇల్లు మునిగిపోతుందని చెప్పామని గుర్తు చేశారు. వరద వస్తే చంద్రబాబు హైదరాబాద్‌ పారిపోయారని విమర్శించారు. ప్రజలకు సూచనలు ఇవ్వాల్సి ఉన్న చంద్రబాబు ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయడం తగదని హితవు పలికారు. టీడీపీ నేతలు దిగజారి మాట్లాడుతున్నారని ఫైర్‌ అయ్యారు. 

తాజా ఫోటోలు

Back to Top