సగం పూర్తైయిన ఇళ్లలో గృహప్రవేశాలు చేయించి ఘనంగా ప్రచారం

ముదునూరి ప్రసాద్ రాజు నర్సాపురం
 

పాలకొల్లులో ఇళ్ల లబ్దిదారుల ఎంపికలో అవకతవకలు జరిగాయి. అందరికీ ఇళ్లు పథకంలో పాలకొల్లులో 7159 ఇళ్లు మంజూరయ్యాయి. ఎన్నికల నాటికి అందులో 50శాతం మాత్రమే పనులయ్యాయి. ఎన్నికలొచ్చాయి కనుక ఏదో చేసినట్టు చూపించుకోవాలని సగం పూర్తైయిన ఇళ్లలోకే లబ్దిదారులను గృహప్రవేశాలు చేయించి ఘనంగా ప్రచారం చేసుకున్నారు. ఇక ఇళ్లు సాంక్షన్ అయ్యిన వాళ్లలో కనీసం 1500 మందికి పైగా లబ్దిదారులు అర్హులే కాదు. వారిలో తెలుగుదేశం నాయకులు, జన్మభూమి కమిటీ మెంబర్లు ఇందులో లబ్దిదారుల్లో ఉన్నారు. ఇతర లబ్దిదారుల నుంచి కూడా ఈ జన్మభూమి కమిటీలు డబ్బులు వసూలు చేసాయి. అర్హులకు అన్యాయం చేసి పక్షపాతంగా జరిగిన ఆ ఇళ్ల విషయంలో మంత్రిగారు దర్యాప్తు చేయాలని కోరుతున్నాను. 

Back to Top