తాడేపల్లి: ఐర్లాండ్ లో అన్ని ప్రధాన నగరాల్లో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ఎన్నారైలు మాట్లాడుతూ వైయస్ఆర్ మరణం లేని మహనీయుడని తెలుగు జాతికి ఆయన చేసిన సేవలు ఎప్పుడూ గుర్తుండిపోతాయని పేర్కొన్నారు. తమలో చాలామంది వైయస్ఆర్ ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ద్వారా ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యామని తమ జీవితాల్లో వెలుగులు నింపిన దేవుడు వైయస్ఆర్ అని కొనియాడారు. ఐర్లాండ్ లో అన్ని ప్రధాన నగరాల్లో జరిగిన ఈ వేడుకల్లో కేక్ కటింగ్ మరియు పలు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు. డబ్లిన్ లో జరిగిన కార్యక్రమంలో వైయస్ఆర్‌సీపీ ఐర్లాండ్ కన్వీనర్ ఆకేపాటి కిషోర్ , కోటి గోపి రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ..వైయస్ఆర్ తెలుగు ప్రజలకు అందించిన సేవలు ఎన్నటికీ మరచిపోమని అలాగే తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్న వైయస్ జగన్ గారి బాటను విడవబోమని పునరుద్ఘాటించారు.కార్యక్రమాలలో పాల్గొన్న వారికి జూమ్ కాల్ ద్వారా వైసీపీ నాయకులు, ఆలూరు సాంబశివారెడ్డి , ,అరే శ్యామల అభినందనలు తెలియజేశారు. ఆస్ట్రేలియాలో ఘనంగా వైయస్ఆర్ జయంతి. ఆస్ట్రేలియాలో అన్ని ప్రధాన నగరాల్లో వైయస్ఆర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ఎన్నారైలు మాట్లాడుతూ వైయస్సార్ ఒక మరణం లేని మహనీయుడని తెలుగు జాతికి ఆయన చేసిన సేవలు ఎప్పుడూ గుర్తుండిపోతాయని పేర్కొన్నారు. తమలో చాలామంది వైయస్సార్ ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ద్వారా ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యామని తమ జీవితాల్లో వెలుగులు నింపిన దేవుడు వైయస్సార్ అని కొనియాడారు. ఆస్ట్రేలియాలోని అన్ని ప్రధాన నగరాల్లో జరిగిన ఈ వేడుకల్లో కేక్ కటింగ్ మరియు పలు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు. బ్రిస్ బేన్ లో జరిగిన కార్యక్రమంలో వైయస్ఆర్‌సీపీ ఆస్ట్రేలియా కన్వీనర్ చింతలచెరువు సూర్యనారాయణ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైయస్ఆర్ తెలుగు ప్రజలకు అందించిన సేవలు ఎన్నటికీ మరచిపోమని అలాగే తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్న వైయస్ జగన్ గారి బాటను విడవబోమని పునరుద్ఘాటించారు.ఈ కార్యక్రమంలో ఇరువురి బ్రహ్మారెడ్డి, బొమ్మిరెడ్డి జస్వంత్ రెడ్డి ,వీరం రెడ్డి శ్రీధర్ రెడ్డి, సాగర్, విష్ణు, వంశీ చాగంటి, రామకృష్ణారెడ్డి వల్లూరి, జగ్గవరపు రాకేష్, కోటా శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాలలో పాల్గొన్న వారికి జూమ్ కాల్ ద్వారా వైసీపీ నాయకులు, ఆలూరు సాంబశివారెడ్డి , సోషల్ మీడియా ఇన్ఛార్జి యశ్వంత్, చల్లా మధుసూదన్ రెడ్డి, అబ్బయ్య చౌదరి ,అరే శ్యామల , మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, కారుమూరి వెంకట్ రెడ్డి, కొట్టు సత్యనారాయణ, బియ్యపు మధుసూదన్ రెడ్డి, అభినందనలు తెలియజేశారు.