అసెంబ్లీ: ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి 2019–20 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో ఖర్చు చేసి ముఖ్యమంత్రి వైయస్ జగన్ అని వైయస్‌ఆర్ సీపీ ఎమ్మెల్యే మేరుగ నాగార్జున అన్నారు. రాబోయే రోజుల్లో ఇంకా మిన్నగా దళిత సంక్షేమానికి సీఎం వైయస్ జగన్ బాటలు వేస్తారన్నారు. అసెంబ్లీలో ఎమ్మెల్యే మేరుగ నాగార్జున మాట్లాడుతూ.. గత ప్రభుత్వం 2018–19లో ఎస్సీల కోసం రూ. 8,903 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందన్నారు. ప్రస్తుత వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి సర్కార్ రూ.13,251 కోట్లు దళిత సంక్షేమానికి ఖర్చు చేసిందన్నారు.