టీడీపీకి పాంప్లెట్‌లా యెల్లో మీడియా

వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే మ‌ల్లాది విష్ణు

విజ‌య‌వాడ‌:  యెల్లో మీడియా తెలుగు దేశం పార్టీకి పాంప్లెట్‌లా ప‌ని చేస్తోంద‌ని వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే మ‌ల్లాది విష్ణు మండిప‌డ్డారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 మీడియా పరువు తీస్తున్నాయ‌ని విమ‌ర్శించారు. చంద్రబాబుకి బాకా ఊదుతూ.. సంక్షేమ ప్రభుత్వంపై విషపు రాతలు, కథనాలు రాస్తోంద‌ని ఎమ్మెల్యే ధ్వ‌జ‌మెత్తారు.  సీఎం వైయ‌స్ జగన్ సంక్షేమ పథకాలు ఎల్లో మీడియా తప్పుదోవ పట్టిస్తోంద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. చంద్రబాబు ప్రభుత్వం లోనే ఎక్కువ శాతం అప్పులు చేశార‌ని, చంద్రబాబు కన్నా 100 రెట్లు ఎక్కువ మంచి పనులు చేసిన ప్రభుత్వం సీఎం వైయ‌స్‌ జగన్ ప్రభుత్వందే అన్నారు. ప్రతిపక్షాలకు మతిభ్రమించి నీచ రాజకీయాలకు పాల్పడుతున్నాయ‌ని దుయ్య‌బ‌ట్టారు. సీఎం వైయ‌స్‌ జగన్ సంక్షేమ పథకాలు చంద్రబాబు కాపీ కొట్టాలనుకుంటున్నాడ‌ని తెలిపారు. 2024 లో మ‌ళ్లీ సీఎం వైయ‌స్ జగన్ ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నార‌ని మల్లాది విష్ణు తెలిపారు.

Back to Top