విజయవాడ: చరిత్రలో ఎవరూ సాధించలేని విజయాన్ని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి సాధించారని వైయస్‌ఆర్ సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అన్నారు. పదేళ్లుగా అన్ని వ్యవస్థలను భ్రష్టుపట్టించిన కాంగ్రెస్, చంద్రబాబు నాయుడు ఒక వ్యక్తిని లక్ష్యంగా చేసుకొని ఇబ్బందులు పెట్టారు. వైయస్ జగన్ కాకుండా వేరే వ్యక్తులు అయి ఉంటే మనోనిబ్బరం కోల్పోయేవారని, కానీ, వైయస్ జగన్ ప్రజల మీద విశ్వాసం, నమ్మకంతో విలువలు, విశ్వసనీయతతో మాట తప్పకుండా రాజకీయాలు చేశారన్నారు. దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి ఏ లోకాన ఉన్నా.. ఆయన ఆత్మ సంతోషంతో ఉప్పొంగుతుందన్నారు. ఆంధ్రరాష్ట్రంలో తిరిగి మళ్లీ తన సంక్షేమ రాజ్యం రాబోతుందని, తన బిడ్డ కోట్లాది మంది ప్రజల విశ్వాసాన్ని కూడగట్టుకున్నారని సంతోషిస్తారన్నారు. 2019లో 50 శాతం ఓట్లతో అధికారంలోకి వచ్చాం. ఈ ఐదేళ్లలో వైయస్ జగన్ పాలన తరువాత 2024లో 70 శాతం ఓట్లతో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.