80 శాతం హామీలు అమలు చేశాం 

వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి

 
 విజయవాడ: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారని, ఇప్పటికే 80 శాతం హామీలు అమలు చేశారని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి  అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైయస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇంటింటికే వెళ్లి పింఛన్లు అందిస్తున్నామని పేర్కొన్నారు. అమ్మఒడి పథకం అమలుతో ప్రజలు సంక్రాంతి పండగ చేసుకున్నారని చెప్పారు.  ఎదుటివారిపై బురద చల్లడమే చంద్రబాబు పని అన్నారు. అయినవాళ్లనే నిట్టనిలువుగా ముంచిన వ్యక్తి చంద్రబాబు అని దుయ్యబట్టారు. బీసీలను చంద్రబాబు మోసం చేశారని.. వెనుకబడిన కులాలకు చంద్రబాబు చేసిందేమీ లేదని ఎమ్మెల్యే పార్థసారధి ఆగ్రహం వ్యక్తం చేశారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top