వైయస్ఆర్‌సీపీ కార్యకర్తలపై పోలీసుల లాఠీఛార్జ్

ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటి వద్ద పోలీసుల ఓవరాక్షన్

నిరసనగా రోడ్డుపై బైఠాయించిన ప్రసన్న కుమార్ రెడ్డి

పోలీసులకు వ్యతిరేకంగా వైయస్ఆర్సీపీ శ్రేణుల నినాదాలు

నెల్లూరు:  వైయస్ఆర్‌సీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నెల్లూరు జిల్లా ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా పోలీసులు ఓవ‌రాక్షన్ చేశారు.  మాజీ మంత్రి ప్ర‌స‌న్న కుమార్ రెడ్డి ఇంటి వ‌ద్ద వైయస్ఆర్‌సీపీ కార్యకర్తలు, ప్రజలపై పోలీసుల లాఠీఛార్జ్ చేశారు.  మహిళలు, వృద్ధులపైనా కూడా  పోలీసులు దౌర్జ‌న్యం చేశారు. పోలీసుల తీరును నిర‌సిస్తూ ప్ర‌స‌న్న‌కుమార్‌రెడ్డి రోడ్డుపై బైఠాయించి ఆందోళ‌న చేప‌ట్టారు. పోలీసుల తీరుపై ఆయ‌న ఆగ్రహం వ్య‌క్తం చేశారు. పోలీసులకు వ్యతిరేకంగా వైయస్ఆర్‌సీపీ శ్రేణుల నినాదాలు చేశారు. పోలీస్‌ జులుం నశించాలంటూ వైయస్ఆర్‌సీపీ కార్యకర్తలు ఆందోళ‌న‌కు దిగారు. మా కార్యకర్తలను అన్యాయంగా కొట్టార‌ని ప్రసన్నకుమార్‌రెడ్డి ఫైర్ అయ్యారు. స్వచ్ఛందంగా ప్రజలు తరలివస్తుంటే పోలీసులు అడ్డుకోవ‌డం దుర్మార్గ‌మ‌న్నారు.  జనం రాకుండా రోడ్లు తవ్వ‌డం, బారీకేడ్స్ ఏర్పాటు చేయ‌డం స‌రికాద‌న్నారు. వైయ‌స్ జ‌గన్‌ అభిమానులను ఎవరూ ఆపలేర‌ని ఆయ‌న హెచ్చ‌రించారు.

Back to Top