నెల్లూరు జైల్లో కాకాణితో వైయ‌స్‌ జగన్‌ ములాఖత్‌

నెల్లూరు:  అక్రమ కేసుల్లో నెల్లూరు జైల్లో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్దన్‌రెడ్డి గోవ‌ర్ధ‌న్‌రెడ్డితో వైయ‌స్ఆర్‌సీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ములాఖత్ అయ్యారు. ఆయ‌న యోగ‌క్షేమాలు అడిగి తెలుసుకొని అధైర్య ప‌డొద్ద‌ని కాకాణికి ధైర్యం చెప్పారు. వైయ‌స్‌ జగన్‌ వెంట కాకాణి కూతురు, ఎంపీ గురుమూర్తి, మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఉన్నారు. అక్క‌డి నుంచి టీడీపీ గుండాల దాడి నుంచి తప్పించుకున్న మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డిని వైయ‌స్ జ‌గ‌న్ ప‌రామ‌ర్శించేందుకు వెళ్లారు.   ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటి దగ్గర కూడా పోలీసులు ఆంక్షలు పెట్టారు. 100 మందికి మాత్రమే అనుమతి ఉంటుందని చెప్పారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని ఎస్పీ దామోదర్ హెచ్చ‌రించ‌గా ప్ర‌జ‌లు ఆంక్ష‌లు దాటుకొని స్వ‌చ్ఛందంగా ప్ర‌స‌న్న కుమార్ ఇంటి వైపు రాగా, పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. అడుగడుగునా డ్రోన్‌ కెమెరాలతో నిఘా పెట్టారు. వైయ‌స్ఆర్‌సీపీ నేతలు, కార్యకర్తల కదలికలను కూడా పర్యవేక్షిస్తున్నారు. వాహనాల డ్రైవర్ల ఆధార్ కార్డులతోపాటు వారి వివరాలు కూడా  పోలీసులు సేక‌రించారు.  

Back to Top