ఒంటిమిట్టలో వైయ‌స్ఆర్‌సీపీ నేత‌ల ఎన్నికల ప్రచారం 

ఉప ఎన్నిక‌లో ఇర‌గంరెడ్డి సుబ్బారెడ్డిని జెడ్పీటీసీగా గెలిపించాల‌ని విజ్ఞ‌ప్తి

వైయ‌స్ఆర్ జిల్లా:   ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నిక‌ల ప్ర‌చారంలో వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు పాల్గొన్నారు. వైయ‌స్ఆర్‌సీపీ అభ్య‌ర్థి ఇర‌గంరెడ్డి సుబ్బారెడ్డిని అత్య‌ధిక మెజరిటీతో జెడ్పీటీసీగా గెలిపించాల‌ని ఎంపీ  మేడా ర‌ఘునాథ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి,  డాక్టర్ సుధా, ఎమ్మెల్సీలు డీసీ గోవింద‌రెడ్డి, రామచంద్రారెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాష, మాజీ ఎమ్మెల్యే రఘురాం రెడ్డి ,కడప మేయర్ సురేష్ బాబు త‌దిత‌రులు చింతరాజుపల్లి లో ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.  కార్య‌క్ర‌మంలో వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడ్డి,  మహిళా విభాగం రాష్ట్ర‌ కార్యదర్శి ఏకుల రాజేశ్వరి రెడ్డి, మండ‌ల అధ్య‌క్షుడు శివారెడ్డి,  త‌దిత‌రులు పాల్గొన్నారు.

Back to Top