కరువు..చంద్రబాబు కవల పిల్లలు

రైతాంగంపై వరుణుడి కటాక్షం లేదు.. పాలకులకు కరుణ లేదు

మా ప్ర‌భుత్వం రైతు భరోసా కింద ఏటా రూ.13500 పెట్టుబడి సాయం అందజేశాం

చంద్ర‌బాబు తొలి ఏడాది అన్నదాత సుఖీభవకు ఎగ‌నామం..ఈ ఏడాది కోత‌

అనంత‌పురం జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి ఫైర్‌

 అనంత‌పురం:  చంద్రబాబు వస్తూ వస్తూ వెంబడే కరువు తీసుకొస్తార‌ని, కరువు–చంద్రబాబు కవలపిల్లలు అంటూ అనంత‌పురం జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి ఎద్దేవా చేశారు. ఆనాడు అపరభగీరథుడు పైనుంచి గంగను తీసుకొచ్చినట్లు చంద్రబాబు ఎప్పుడొచ్చినా కరువు తీసుకొస్తాడ‌ని రాయలసీమలో అంటుంటార‌ని గుర్తు చేశారు. గత ఏడాది, ఈ ఏడాది పరిస్థితులు చూస్తే అలాగే ఉన్నాయ‌ని అభివ‌ర్ణించారు. ఉమ్మడి అనంతపురం జిల్లా రైతు సమస్యలపై గురువారం అనంత వెంక‌ట్రామిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆయ‌న ఏమ‌న్నారంటే..

  • గత ఏడాది మారిగానే ఈ ఏడాది కూడా ఉమ్మడి అనంతపురం జిల్లా కరువు కోరల్లో చిక్కుకుంది. 
  • రైతాంగంపై వరుణుడి కటాక్షం లేదు.. పాలకుల కరుణ లేదు.
  • వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. 
  • ఖరీఫ్‌ ప్రారంభంలో అరకొరగా వర్షాలు కురిస్తే వేరుశనగ, పత్తి, ఆముదం, కందులు సాగు చేశారు. ఇప్పుడు ఆ పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చింది. 
  • ఉమ్మడి అనంతపురం జిల్లాలో సాధారణ సాగు విస్తీర్ణం 15 లక్షల ఎకరాలు ఉంది. కానీ ఈ ఏడాది కార్తెలు అయిపోయినా ఇప్పటి వరకు కేవలం 3.94 లక్షల ఎకరాల్లోనే వివిధ పంటలు సాగు చేశారు.
  • ఉమ్మడి అనంతపురం జిల్లాలో వేరుశనగ 8 లక్షల ఎకరాలకు పైగా సాగు చేసేవారు. కానీ నేడు 1.63 లక్షల ఎకరాల్లోనే విత్తనం సాగు చేశారు. 
  • ప్రభుత్వం ప్రత్యామ్నాయ పంటల సాగు విషయంలో ఆలోచన చేసే పరిస్థితి లేదు. 
  • రైతాంగం, వర్షాభావ పరిస్థితులు, కరువు పరిస్థితులపై జిల్లాలోని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఆలోచన చేయకుండా కాలయాపన చేస్తున్నారు.
  • వ్యవసాయ అధికారుల నుంచి కలెక్టర్‌ వరకు కరువు పరిస్థితుల నుంచి ఎలా బయటపడాలో ప్రణాళిక రూపొందించుకోలేదు. ఇలాంటి పరిస్థితి గతంలో ఎన్నడూ లేదు. 
  • తుంగభద్ర డ్యాంలో నీరు పుష్కలంగా ఉన్నాయి. అవి సముద్రం పాలవుతున్నా ప్రణాళిక లేక పనులు సకాలంలో పూర్తి చేయకపోవడంతో రైతులు అవస్థలు పడుతున్నారు. 
  • వైఎస్‌ జగన్‌ హయాంలో ప్రభుత్వమే ఇన్సూరెన్స్‌ చెల్లించేది. చంద్రబాబు వచ్చాక రైతులే ప్రీమియం చెల్లించాలని నిబంధన పెట్టారు. బీమా ప్రీమియం చెల్లింపు గడువు ముగిసినా చాలా మంది రైతులు కట్టలేదు. 
  • వైఎస్‌ జగన్‌ హయాంలో పీఎం కిసాన్‌తో కలిపి రైతు భరోసా కింద ఏటా రూ.13500 పెట్టుబడి సాయం అందజేశాం.  
  • గత ఎన్నికల సమయంలో  కేంద్రంతో సంబంధం లేకుండా అన్నదాత సుఖీభవ కింద ఏటా రూ.20 వేలు ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. తీరా అధికారంలోకి వచ్చాక కేంద్రంతో కలిపి ఇస్తామన్నారు. అధికారంలోకి వచ్చాక తొలి ఏడాది రైతుకు ఎగనామం పెట్టారు. ఈ ఏడాది కేంద్రంతో ముడిపెడుతున్నారు. 
  • వైఎస్‌ జగన్‌ సీఎంగా ఉన్న సమయంలో ఐదేళ్ల పాటు రాష్ట్రంలో దాదాపు 53 లక్షల 58 వేల మంది రైతులకు రైతు భరోసా అందజేశాం.
  • ఉమ్మడి అనంతపురంలో వైఎస్‌ జగన్‌ సీఎంగా ఉన్నప్పుడు 5 లక్షల 74 వేల మందికి రైతు భరోసా కింద పెట్టుబడి సాయం అందజేశాం.  
  • కూటమి ప్రభుత్వంలో ఇప్పుడిస్తారో తెలియని పరిస్థితి ఉంది. ఎంత మందికి ఇస్తారో తెలియదు. రైతులు ఈ–కేవైసీ, ఎన్‌పీసీఐ లింక్‌ కష్టాలు పడుతున్నా అధికార యంత్రాంగానికి పట్టడం లేదు. 
  • హెచ్‌ఎల్‌సీ కింద అక్కడక్కడా నాట్లు వేద్దామనుకుంటే ఎరువుల కొరత వేధిస్తోంది. రెండు నెలల క్రితమే మీడియా సమావేశంలో ఎరువుల ప్రస్తావన తెచ్చాం. కానీ ప్రభుత్వంలో స్పందన లేదు. 
  • ఈ రోజు రైతాంగం బ్లాక్‌లో ఎరువులు కొంటున్న పరిస్థితి. అక్కరకు లేని ఫర్టిలైజర్స్‌ కొంటేనే ఎరువులు ఇస్తామంటున్న పరిస్థితి ఉంది. అధికారులు, వ్యాపారులు కుమ్మక్కై రైతాంగాన్ని ముంచుతున్నారు. 
  • ఓ వైపు భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. బోర్లన్నీ ఎండిపోతున్నాయి. రిగ్గులు రేట్లు పెంచేశారు. 
  • జిల్లాలో ఉద్యాన పంటలు ఎక్కువ. ఆ రైతుల పరిస్థితి కూడా దారుణంగా ఉంది. 
  • ఇప్పటికైనా మంత్రులు, ప్రజాప్రతినిధులు వ్యవసాయంపై సమీక్ష చేయండి. 
  • గత ఏడాది ఖరీఫ్, రబీలో ఇన్సూరెన్స్, ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇవ్వలేదు. ఈ ఏడాది కూడా అదే పరిస్థితి తెస్తారా?
  • ఐఏబీ (ఇరిగేషన్‌ అడ్వయిజరీ బోర్డ్‌) సమావేశం ఇంకా పెట్టలేదు. నీరు ఉన్నా తెచ్చుకోలేని పరిస్థితి ఉంది. 
  • మేం రైతులు, ప్రజాసమస్యలపై మాట్లాడితే దూషించడం వరకే ప్రజాప్రతినిధులు పరిమితం అవుతున్నారు. ఇలాంటి దారుణ పరిస్థితి ఎన్నడూ చూడలేదు. 
  • ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రకటనలకే పరిమితం కావద్దు. రైతాంగాన్ని ఆదుకునే దిశగా చర్యలు తీసుకోవాలి. 
  • సంక్షేమ పథకాల్లో ఎలా కోతలు పెట్టాలా? అనే ఆలోచనలోనే ప్రభుత్వం ఉంది. తల్లికి వందనం కూడా అలాగే చేశారు. ఇప్పుడు అన్నదాత సుఖీభవలో కూడా కొర్రీలు పెట్టి రైతుల సంఖ్యను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. 
  • వ్యవసాయ అధికారులు గ్రామాల్లో పర్యటించడం లేదు. రైతు భరోసా కేంద్రాలు ఉన్నా అక్కడ సిబ్బందిని వాడుకోని పరిస్థితిలో ప్రభుత్వం ఉంది. 
  • వైఎస్‌ జగన్‌ అందించిన సంక్షేమ పథకాల కారణంగా జిల్లాలో వలసలు తగ్గిపోయాయి. కానీ నేడు మళ్లీ వలసలు ప్రారంభం అయ్యే పరిస్థితులు ఉన్నాయి. 
  • ప్రభుత్వం స్పందించకపోతే కలిసి వచ్చే పార్టీలు, రైతులతో కలిసి పోరాటానికి సిద్ధంగా ఉన్నాం.
Back to Top