నిజం గెల‌వాల‌ని కోరుకుంటే బాబు జీవితంలో బ‌య‌ట‌కురాలేడు

చంద్ర‌బాబు కోస‌మే ప‌వ‌న్ జ‌న‌సున్నా పార్టీ

వైయ‌స్ఆర్ సీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని ధ్వ‌జం

కృష్ణా జిల్లా: నిజం గెలిచింది కాబట్టే చంద్రబాబు జైల్లో ఉన్నాడని, నారా భువనేశ్వరి కూడా నిజం గెలవాలని కోరుకుంటే బాబు జీవితంలో జైలు నుంచి బయటకురాలేడ‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. చంద్ర‌బాబు స‌తీమ‌ణి భువనేశ్వరి చేప‌డుతున్న‌ నిజం గెలవాలి యాత్రపై మండిపడ్డారు. కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు కుటుంబమంతా అవినీతి సొమ్ముతో మునిగిపోయిందన్నారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఏ స్థితిలో ఉన్నారు.. నారా భువనేశ్వరి ఏ స్థాయిలో ఉంద‌ని ప్ర‌శ్నించారు. రెండు ఎకరాలతో ప్రారంభమైన చంద్రబాబు ప్రస్థానం నేడు 2 వేల కోట్ల రూపాయ‌లు దాటిందన్నారు. 40 రోజుల్లో ఢిల్లీ లాయర్లకు రూ.35 కోట్లు ఏ విధంగా ఫీజులు చెల్లించారు..? కష్టపడి పొలం దున్నితే వచ్చిన డబ్బుతోనే రూ.7 కోట్లతో రూపొందించిన బస్సులో యాత్ర చేస్తున్నారా? అని కొడాలి నాని ప్ర‌శ్నించారు. 

చంద్ర‌బాబు కోస‌మే ప‌వ‌న్ క‌ల్యాణ్ జ‌న‌సున్నా పార్టీ స్థాపించాడ‌ని ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. 2019 ఎన్నికల్లోనూ పవన్ వెనుక టీడీపీకి మద్దతుగా ఉన్నాడని, ఇప్పుడు ముసుగు తొలగించాడ‌న్నారు. తండ్రి అరెస్టుతో లోకేష్ పప్పు అని మరోసారి రుజువైందని, ఢిల్లీ పారిపోయి తల్లిని రోడ్లపై తిప్పుతున్నాడని విమ‌ర్శించారు. 

Back to Top