గుడివాడ గడ్డపై నన్ను ఓడించే దమ్ము టీడీపీకి లేదు

దేవినేని అవినాష్‌ గుండాగిరికి, డబ్బుకు ఇక్కడి ప్రజలు లొంగరు

చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనలో గుడివాడకు ఏం చేశారు

చంద్రబాబుకు అల్జిమర్స్‌ వ్యాధి

వైయస్‌ జగన్‌ సీఎం అయితే నవరత్నాలు తెస్తారు

ఎమ్మెల్యే కొడాలి నాని 

 

గుడివాడ: గుడివాడ గడ్డపై తనను ఓడించే దమ్ము టీడీపీ నాయకులకు లేదని ఎమ్మెల్యే కోడాలి నాని పేర్కొన్నారు. విజయవాడ నుంచి గుండాలను తీసుకువచ్చి ఇక్కడ పోటీ చేయిస్తున్నారని, దేవినేని అవినాష్‌ గుండాగిరికి, డబ్బుకు ఇక్కడి ప్రజలు లొంగరని హెచ్చరించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గుడివాడలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు.  ఈ రోజు జరుగుతున్న ఎన్నికలు దుర్మార్గపు పాలన పోవాలని, ఒక వర్గానికి కొమ్ముకాస్తూ..అన్ని వర్గాలను దోచుకుంటున్న చంద్రబాబు పాలనకు చరమ గీతం పాడాలని వైయస్‌ జగన్‌ సారధ్యంలో వైయస్‌ఆర్‌సీపీ పని చేస్తుందన్నారు.

వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయితే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ధనిక వర్గాల్లో ఉన్న పేదలకు ఆర్థికంగా, సామాజికంగా పార్టీ అండగా ఉంటుందని చెప్పారని గుర్తు చేశారు. చంద్రబాబు రాష్ట్రంలో ఐదేళ్లు ముఖ్యమంత్రిగా పని చేశారని, గతంలో తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా పని చేశారన్నారు. ఇటీవల గుడివాడకు వచ్చి టీడీపీ అభ్యర్థిని గెలిపిస్తే విజయవాడకు వెళ్లేందుకు నాలుగు లైన్ల రోడ్లు నిర్మిస్తానని, బస్టాండ్‌ నిర్మిస్తానని, పేదలకు ఇళ్లు నిర్మిస్తానని హామీ ఇచ్చారన్నారు. చంద్రబాబుకు మైండ్‌ పని చేయడం లేదని, ఆల్జి్జమర్స్‌ జబ్బుతో బాధపడుతున్నారన్నారు. 9 ఏళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు గుడివాడలో ఎందుకు బస్టాండ్‌ నిర్మించలేదని ప్రశ్నించారు. ఇంటర్‌ మీడియట్‌ కాలేజీ కూడా పెట్టని వ్యక్తి చంద్రబాబు అన్నారు. దద్దమ్మ ముఖ్యమంత్రి చంద్రబాబు అని విమర్శించారు.

2004లో గుడివాడ నుంచి పాదయాత్ర చేసింది తానే అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి 97 ఎకరాల భూమి కేటాయిస్తే..చంద్రబాబు, కిరణ్‌కుమార్‌రెడ్డిలు గుడ్డి గు్రరాలకు పండ్లు తోమారా అని ప్రశ్నించారు.  
వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి కాగానే పిల్లలకు బడికి పంపిస్తే ప్రతి ఏటా రూ.15 వేలు తల్లి ఖాతాలో జమా చేస్తారని, ఉన్నత చదువులు చదివేందుకు పూర్తిగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇస్తారని, హాస్టల్‌  ఖర్చులకు రూ.20 వేలు ప్రతి ఏటా ఇస్తారన్నారు. రూ.1000 బిల్లు దాటితే ఆరోగయశ్రీ వర్తింపజేసి ఉచిత వైద్యం అందిస్తారని తెలిపారు. కార్పోరేట్‌ ఆసుపత్రుల్లో వైద్యం అందిస్తారని చెప్పారు. పొదుపు సంఘాల రుణాలను నాలుగు దఫాల్లో మాఫీ చేసి నేరుగా మహిళలకు ఇస్తారని వివరించారు. రైతులకు ప్రతి ఏటా పెట్టుబడి కోసం రూ.12500 ఇస్తారన్నారు.

 గుడివాడలో తనను ఓడించేందుకు విజయవాడ నుంచి దేవినేని అవినాష్‌ కొడుకును తీసుకొచ్చారన్నారు. ఆయన గుండాగిరి అందరికి తెలుసు అన్నారు. మేక వన్నె పులి మాదిరిగా దేవినేని అవినాష్‌ ప్రవర్తిస్తున్నారని జాగ్రత్తగా ఉండాలన్నారు. వంగవీటి రంగను దారుణంగా చంపించిన ఘనత దేవినేని నెహ్రు అన్నారు. చంద్రబాబు కుల రాజకీయాలు చేస్తున్నారని, గుడివాడలో డబ్బులకు ఓట్లు వేయరన్నారు. విజయవాడ నుంచి తెచ్చుకున్న డబ్బు, మందీమార్భలానికి ఇక్కడి ఓటర్లు లొంగరని హెచ్చరించారు. గుడివాడలో వైయస్‌ఆర్‌సీపీ జెండాను ఎగురవేస్తామని, వైయస్‌ జగన్‌ను ముఖ్యమంత్రిని చేసుకుంటామని చెప్పారు.

 

Back to Top